www.suryaa.com

హోమిమోపతి వైడ్య విథానం (హెల్త్‌ గైడ్‌)

back-pain

ప్ర : డాక్టర్‌ గారు నా వయసు 39 సంరాలు నాకు 6 నెలల నుండి నడుము నొప్పి కాళ్ళ నొ ప్పులు ఉన్నాయి. దీనికి హోమియోపతి మం దులు సూచించగలరు. నడుస్తున్నపుడు ఎక్కువగా ఉంటుంది. నాకు మలబద్ధకం ఎ క్కువ. దాహం కూడ ఎక్కువగా ఉంటుంది. చల్లగాలి అంతగా పడదు?


జవాబు: మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కాల్షియం తక్కువ అవడం వల్ల ఎముకలలో అరుగుదల మొదలైన డుములో స్పాండలోసిస్‌ వచ్చి ఉండవచ్చును. మోకాళ్ళ లో ఆస్టియో ఆర్ట్రిటిస్‌ వచ్చి ఉండవచ్చును. మీ వమసు ను బట్టి మీరు మెనోపాజ్‌కి దగర్గగా ఉన్నారు హార్మోన్స్‌ లో మా ర్పు వచ్చికూడ ఎముకలతో అరుగుదల మొద లై ఉండవచ్చును.

మీరు లావుగా ఉన్నచో బరువు తగ్గించుకొనగలరు ఇందుకొరకు మీరు క్రొవ్వు పదార్థాలు అనగా బీపి వస్తువులు ఫ్రై చేసిన కూరలు, చికెన్‌, మటన్‌ మొదలైనవి ఆహారంలో తగ్గిం చుకొనగలరు. ఆకు కూరలు, కూరగాయలు, పళ్ళు ఎక్కువగా తీసుకొనగలరు, తేలికైన వ్యా యామం చేయగల రు. హోమియోపతి మందుల తో మీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎముకల అరుగుదలను స్లోచేసి నొప్పుల ను చాలా వరకు ఎలాంటి దుష్పలితాలు లేకుం డా తగ్గించవచ్చును. సాధారణంగా ఇలాంటి ఎముకల నొప్పులకు, కీళ్ళ నొప్పులలో ఈ క్రింది మందులు ఎక్కువగా ఉపయోగ పడుతాయి.

1.ఆరంమెట్‌ :- ఎముకలలో అరుగుదల, కేరీస్‌ వల్ల వచ్చే నొప్పులకు ముఖ్యమైన మం దులు
2.కాల్కేరియా ఫ్లోర్‌ :-కీళ్ళలో నోప్పులు, కీళ్ళో కంతాలు లాంటవి ఏర్పడినా కరిగిస్తుంది. ఎముకలలో పటిష్టతకు సహకరిస్తుంది.
3.సైలీషియా :- ఎముకలు బలహీనపడి, వంగిపోతాయి, ము ఖ్యంగా పిల్లలలో రికెట్స్‌ పెద్దలలో ఆస్టియో అర్టిటిస్‌కు ముఖ్యమైన మందు ఇవి కాకుండా రస్టాక్స్‌,కాల్కేరియా కార్చ్‌, తూజా, ఆసిడ్‌ ఫోడ్‌ మొదలైన మందు లు వాటి రోగలక్షణాలను బట్టి ఉపయోగించ వచ్చును.
మీ బాధలకు బ్రయోనియా200 మందును వారానికి ఒకసారి ఒక డోస్‌ చొప్పున నాలుగు వారాలు వాడగలరు, కాల్కేరియా ఫోర6్ఠ టాబ్లె ట్స్‌ రోజు ఉదయం, సాయంత్రం 4 మాత్రలు చొప్పున వాడగలరు తగ్గనిచో మీ దగ్గరలో ఉన్న నిపుణులైన హోమియోపతి వైధ్యుడిని సంప్రరించగలరు.

ప్ర : డాక్టర్‌ గారు నాకు తరుచుగా మూత్రంలో మంట వస్తుంది పొత్తికడుపులో నొప్పిగా ఉం టుంది, జ్వరంగా ఉంటుంది. అపుడపుడు చలి గా ఉంటుంది. అన్ని మందులు వాడాను కానీ తగ్గడం లేదు. నా వయసు 30 సంరాలు మీ రు నాకు సరయైన హోమియోపతి మందులు సూచించగలరు?


జవాబు:మీరు మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ వల్ల బాధపడుచున్నారు. మంచినీళ్ళు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకొనగలరు.తేలికైన ఆహారం తీసుకోనగలరు. మీరు కాంతారిస్‌ 200 రిస్‌ మం దును మూడు రోజులకు ఒక డోసు చొప్పున నాలుగు వారాలు వాడగలరు ఒక నెల తరువాత మెడోర్రినమ్‌ మందు ను ఒక డో సు వేసుకోగలరు మీ ప్రాబ్లమ్‌ పూర్తిగా తగ్గి పోతుంది.

ప్ర: డాక్టర్‌ గారు, నా వయస్సు 20 ఏళ్లు. నాకు అంగం పైన పులిపిరి కాయలు వచ్చాయి. ఆరు నెలల నుండి బాధపడుతున్నాను.నొప్పి, దురద ఏమీ లేదు.నాకు సరియైన హోమియోపతి మ ందు తెలుపగలరు.


జవాబు: మీరు తూజా1ఝ మందును వారానికి ఒక డోసు చొప్పన నాలుగు వారాలు వాడా ల్సి ఉంటుంది. తగ్గనిచో దగ్గరలోని నిపుణులైన హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి. మీ బాధకు వంద శాతం హోమియోపతి మందుతో నయం చేయవచ్చు. కాస్టకమ్‌1ఝ, డిన్న బారి స్‌1ఝ, మెర్కురియస్‌ సాల్యుబిలస్‌ మొదలైనవి ఇతరమందులు.

ప్ర: డాక్టర్‌గారు నాకు రెండేళ్ల నుండి ఒళ్లంతా దద్దుర్లు, దురదలు వస్తున్నాయి. నా వయస్సు 30 ఏళ్లు. అన్ని మందులు వాడాను. తగ్గడం లే దు. చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. నాకు డయాబెటిస్‌ వ్యాధి కూడా ఉంది. కాలుకు అల్స ర్‌ అయింది. మానడం లేదు. షుగర్‌ కంట్రోల్‌ లో లేదు. దయచేసి నాకు హోమియోపతి మం దులు తెలుపగలరు.


జవాబు: మీరు ఇచ్చిన వివరాలు పూర్తిగా సరిపోవు. అయినను మీరు ప్రస్తుతానికి రస్టాక్స్‌ మం దును వా రానికి ఒక డోసు చొప్పున నాలుగు వారాలు వాడండి. డయాబెటిక్‌ అల్సర్‌కు ఇననీషియా..... మందు తో డ్రెస్సింగ్‌ చేయండి. నెల తర్వాత సల్ఫర్‌ 200 మందును ఒక డోసు వేసుకొనగలరు. సరియైన పోషకాహారాన్ని తీసు కోండి. వ్యాయామం చేయండి. చేపలు, వంకా య, గోంగూర, చింతపండు పులుపు మానివేయండి. తగ్గగపోతే నిపుణులైన హోమియోపతి వైద్యుడిని సంప్రదించండి.

ప్ర: డాక్టర్‌ గారు నాకు 12 ఏళ్ల వయస్సు గల అమ్మాయి ఉంది. చిన్నప్పటి నుండి కొంచెం వీ క్‌గా ఉంటుంది. బరువు వయస్సు ంటే తక్కువగా ఉంటుంది. ఆకలి తక్కువ. ఎత్తు కూడా త క్కువగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండ వు.మా అమ్మాయి ఎత్తు పెరగడానికి మందులు తెలపండి.


జవాబు: ఎత్తు అనేది జీన్స్‌ బట్టి వస్తుంది. ఆరోగ్యంగా మంచి పోషకాహారం తీసుకుంటూ కొం త వ్యాయామం చేసినట్లయితే వారు ఎంత ఎ త్తుకు ఎదగాలో అది ఆటో మేటిక్‌గా వస్తుంది. కొన్ని కారణాల వల్ల కొంత మందిలో ఎదుగుదల తగ్గవచ్చు. ఆ కారణాన్ని సరిచేసినట్లయి తే, ఆరోగ్యంగా ఎదుగుతారు. పిల్లలు ఎక్కువ గా 11 ఏళ్ల ను ండి 16 ఏళ్ల వరకు పెరుగుతా రు. ఈ సమయంలో పా లు, పళ్లు, మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి.

హోమియోపతిలో ఎ ముకల బలానికి, ఎదుగుదలకు ‘కాల్కేరియాఫా స్‌ 6 మందును రోజుకు ఉదయం/ సాయత్ర ం నాలుగు మాత్రల చొప్పున ఆరు మాసాల నుం డి ఒక సంవత్సరం వరకు వాడినచో ఆ పిల్ల ల్లో మంచి ఎదుగుదల ఉంటుంది. ఇంకా బెరై టా కార్బ్‌, అయోడియమ్‌, కాల్కేరియాకార్చ్‌ సైలీషియా, ట్యూబెర్‌ కులినమ్‌ మొదలైన హోమియోపతి మందులను ఆ పిల్లలశరీర తత్వాన్ని బ ట్టి ఇచ్చినట్లయితే, వారు మాములుగా ఎదగడానికి ఉపయోగపడతాయి

సాధారణంగా చిన్నపిల్లల్లో ఎరితిమా, ఎక్జిమా, హెర్పిస్‌, సోరియాసిస్‌, అర్టీకేరియా మరియు గజ్జి, తామర అనబ డే వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధుల్లో సాధారణంగా చర్మ ంపై నల్లమచ్చలు, ఎర్రమచ్చలుగా, పొడగా లేదా కార డం, చర్మం పై పొలుసుగా రావడం మొదలైన లక్షణాలు ఆయా జబ్బులను బట్టి వస్తాయి. కొన్ని చర్మవ్యాధులు కొ న్ని కొన్ని చోట్ల వస్తాయి. గజ్జి వ్యాధిలో చేతి వేళ్లలో, తొడ లోపలి భాగంలో మరియు శరీరం ఇతర భాగాలలో వ్యా పిస్తుంది. ‘సొరియాసిస్‌’లో పొలుసుగా పొడి చర్మం వ స్తుంది. ‘ఎరితిమా’ వ్యాధిలో చర్మం ఎర్రబడి దురదగా ఉంటుంది. పోతుంది. అర్టికేరియా లో దద్దుర్లువస్తాయి. ఒళ్లంతా రావచ్చును. విపరీతంగా దురద వస్తుంది.

‘ఎక్జిమా’ వ్యాధి ముఖ్యంగా కీళ్ల మలుపులో వస్తుంది. పొట్ట, వీపు, కాళ్లు, చేతుల్లో, మెడ వద్ద వస్తుంది.

కారణాలు: ఎలర్జీ వల్ల, వాతావరణ మార్పుల వల్ల, తినే వస్తువులలో కొన్ని పడకపోవడం వల్ల, శుభ్రత సరిగా లేకపోవడం వల్ల, వంశపారపర్యంగా, ఫంగస్‌ వల్ల మొదలైన అనేక కారణాల వల్ల మానసికంగా కుంగిపోవడం వల్ల కూడా చర్మవ్యాధులు ఎక్కువవుతాయి. మానస, రాయ నపాడు.