Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
మీ వారం 31/01/2010



మేషం : ఈ రాశివారు వృత్తి యందు అభివృద్ధి కొరకు నిపుణులను కలుసుకుంటారు వారి నుండి కొంత విలువైన సమాచారమును స్వీకరిస్తారు. విద్యార్ధులు ఉన్నత విద్య కొరకు చేయు విదేశ ప్రయత్నములు ఫలిస్తాయి. దగ్గరి బంధువుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటా రు. మీరు నమ్మిన కొంత మంది వ్యక్తులు మీ రహస్యములను ఇతరులకు చేరవేస్తారు.



వృషభం : కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని ధన లాభం కలుగుతుంది. కళారంగంలో ఉన్న వార్కి గుర్తింపు వస్తుంది. మీ పిల్లలు యొక్క ఉన్నత విద్య కొరకు ఏర్పాట్లు చేస్తారు. గతంలో మీరు ఇచ్చిన ధనం వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. స్ర్తీలకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యక్తిగత హోదా పెరుగుతుంది. వృత్తిరీత్యా అధికారులను కలుసుకుంటారు.



మిధునం : వృత్తి యందు ఏర్పడుతున్న అడ్డంకులు తొలుగుతాయి. మీ విరోధులు మితృలుగా మీరు మీ అభివృద్ధికి సహకరిస్తారు. బగవంతుని పై నమ్మకం పెరుగుతుంది. నరములకు సంబంధించిన వ్యాధులు కలుగుతాయి. గురు సమానులైన వ్యక్తులు మీ గృహమును సందర్శిస్తారు. స్ర్తీలకు ఉద్యోగ అవకాశములు వస్తాయి. కుటుంబ సభ్యులతో వాదొపవాదాలు జరుగును. జీవితా భాగ స్వామి సహకారం లభిస్తుంది.



కర్కాటకం : వృత్తి యందు గుర్తింపు వస్తుంది. ఆర్ధిక సమస్యలు పరిష్కారించ బడతాయి. విద్యార్ధులు ఉన్నత విద్య కొరకు చేయు ప్రయత్నములు పలిస్తాయి వాయు సంబంధ రోగములు వస్తాయి. తల్లిగారి తరుపు నుండి ఆర్ధిక సహకారము లభిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి స్ర్తీతో విబేధములు వస్తాయి. భార్యతో ఎడబాటు వస్తుంది. తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటారు. వైద్యం కొరకు ధనం ఖర్చు చేయవలసి వస్తుంది.



సింహం: ఈ రాశి వారు మితృల సహకారంతో ఆర్ధిక సమస్యలు పరిష్కరించబడతాయి. మీ కుటుంభంలో ఒకరికి విదేశ అవకాశములు వాస్తియి. వృత్తియందు అభివృద్ధికి గురువుల యొక్క సహకారం లభిస్తుంది. ఆద్యాత్మిక కేంద్రములు సందర్శిస్తారు. వృత్తిరీత్యా అధికారుల నుండి వత్తిడి వస్తుంది. స్ర్తీలతో విరోధములు వస్తాయి. బ్యాంకుల ద్వార ఋణ ప్రయత్నములు ఫలిస్తాయి. కోర్టు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. స్ర్తీలకు ఉద్యోగ అవకాశములు వస్తాయి.



కన్య : ఆర్ధిక పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది. వృత్తిరీత్యా కొంత మంది చెడ్డ వ్యక్తులు మీ యొక్క మంచితనమును తెలివి తేటలును ఉపయోగించుకుంటారు కనుక మీకు సంబంధం లేని విషయముల యందు కలుగజేసుకొనవద్దు. విద్యార్ధు విద్య పై శ్రద్ధ తగ్గి ఇతర విసయాలలో శ్రద్ధ పెడతారు, చెడ్డ వ్యక్తులతో కలసి భవిష్యత్తు పాడు చేసుకునే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు వృత్తియందు ఇబ్బందులు వస్తాయి. రావలసిన అభివృద్ధి ఆగిపోతుంది.



తుల : మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపార ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటు వంటి మితృల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. గృహం లేదా ఉన్న ఊరు నుండి మార్పు కొరుకునే వారి ప్రయత్నములు ఫలిస్తాయి. విదేశ అవకాశములు వస్తాయి. కళారంగంలో ఉన్న వార్కి కొంత అభివృద్ధి నూతన అవకాశములు వస్తాయి. వ్యాపారస్ధులు అదనపు పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెడతారు.



వృశ్ఛికం : ఈరాశి వార్కి అభివృద్ధి కలుగుతుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. చాలా కాలంగా రావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్ధిక సమస్యలు పరిష్కరించబడతాయి. చెడు వార్తలు వినవలసి వస్తుంది. ఒక ముఖ్యమైన పని వాయిదాపడుతుంది. భార్యకు ఉద్యోగ అవకాశం వస్తుంది. స్ర్తీల నుండి అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. తల్లిగారి ఆరోగ్యంతో శ్రద్ధ తీసుకుంటారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.



దనుస్సు : ఈవారం త్వరలో జరపవలసిన శుభకార్యముల గురించి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అధికారంలో ఉన్నటువంటి మిత్రుల సహాయంతో అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తియందు చేయాలనుకున్న మార్పులు వాయిదా పడతాయి. ఎక్కువగా ప్రయాణములు చేయుటవలన అనారోగ్యం కలుగుతుంది. భార్యతరుపు బంధువుల నుండి ధన సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం కలుగుతుంది.



మకరం: బంధువుల గురించి, వైద్యం గురించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రుణములు తీర్చే ప్రయత్నం చేస్తారు. స్ర్తీల వలన ఇబ్బందులు వస్తాయి. అనవసర ప్రయాణముల వలన కాలం ధనం వృధా అవుతాయి. ధనవిషయంలో బంధువులతో విరోధములు వస్తాయి. వాహన ప్రయాణమలు చేయునపుడు జాగ్రత్త వహించుట మంచిది. భాగస్వామి చేతిలో మోసపోయే అవకాశం ఉన్నది. సొంత విషయాలలో అశ్రద్ధ వహిస్తారు.



కుంభం: ఈ రాశి వారికి ఈ వారం ధనలాభం ఎక్కువగా ఉన్నది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారించబడతాయి. మిత్రులకు ఉచిత సలహాలు ఇస్తూ సహాయం చేస్తారు. కుటుంబ విషయాలలో అశ్రద్ధ వహించుటవలన భార్య నుండి విమర్శలు ఎదుర్కొంటారు. అధికారులకు లంచం ఇచ్చి మీ పనులు పూర్తి చేసుకుంటారు. లివర్‌ సంబంధించిన వ్యాధులు కలుగవచ్చును. కోర్టు సమస్యలు పరిష్కరిచబడతాయి. రక్షకబటుల వలన ఇబ్బందులు వస్తాయి.



మీనం : ఈ వారం అనుకున్న పనులు అన్నీ వాయిదా పడతాయి. నమ్మిన వారి వలన మోసం జరుగుతుంది. మీ సొంత వ్యవహారమలయందు ఇతరులు జోక్యం వలన అసహనమునకు గురి అవుతారు. మీ మంచితనమును ఎదుటివారు స్వలాభం కోసం ఉపయోగించుకుంటారు. తల్లిగారి ఆరోగ్య విషయంలో ఆందోళన కలుగుతుంది. వారం చివరిలో అనవసర ప్రయాణములు ఆర్థిక నష్టం అనారోగ్యం కలుగుతుంది. స్ర్తీలనుండి, అధికారులనుండి సహాయం లభిస్తుంది.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement477
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us