Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
మూలవ్యాధి హూమియో చికిత్స

మలబద్దకంతో, జీవనశైలిలోని మాంద్యంతో కూడిన అలవా టు వల్ల వచ్చే అనేక రకాలైన వ్యాధులతో బాధపడే వాటిలో ఈ మూలవ్యాధి కూడ ఒకటి. దీనినే వాడుక బాషలో అర్శ మొల లు లేదా అర్శమొలలు అంటారు.-మూలవ్యాధి అంటే ఆసనము దగ్గర ఉబ్బి మెలికలు తిరిగిన సిరలు వల్ల ఏర్పడే బాధ అంటారు.

రకాలు: ఇవి రెండు రకాలు ఉంటాయి.
1 బాహ్య మొలలు: గుదము , ఆసనము అంచున చేతికి తగిలేవి.
2 అంతర్గతమొలలు: ఆసనములోపల కొంచెం లోతుకి తగులు మూలలు, ఈ రకము తీవ్రబాధతో కూడి రక్తము చిందించే మూ లలుగా పరిగణిస్తారు. కొన్నిసార్లు కొంతమందిలో రెండు రకాల ను ఒకేసారిగా చూస్తాము.

కారణాలు...
1. మలబద్ధకం: దీని వలన మలవిసర్జన చేయుటకు ఎక్కువగా ముక్కటం వలన ఆ ప్రాంతంలోని సిరలు సంకోచం చెంది వాపుకి గురవుతాయి.
2.ఆహార లోపం: పీచుపదార్థాలు తక్కువగా తీసుకుంటూ అధి కం నేటి నాగరిక ఆహారపు అలవాట్లు అనగా మసాల పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు ఎక్కువ తీసుకోవటం వలన.
3. కొన్ని వ్యాధులలో ఉపరిసంక్రమణ లక్షణంగా ఉంటుంది.
ఉదాహరణ: మలాశయము క్యాన్సర్‌, గర్భంలో, హోర్టల్‌ హైపర్‌ టెన్షన్‌

లక్షణాలు:
1. రక్తస్రావం: ముఖ్యంగా అంతర మొలలలో కన్పించే ముఖ్య లక్షణం. ఎర్రగా, నొప్పి లెకుండ ప్రతి మలవిసర్జనలో మలముతో పాటుగా కొన్ని నెలల నుంచి సంవత్సరముల వరకు స్రవిస్తూ మె ల మెల్లగా ఆ మొలలు బాహ్యముకు వచ్చేలాగా చేస్తుంది.

2. స్థాన భ్రంశము :అంతర్గత మొలలు బాహ్యము ఏర్పడటానికి నాలుగు రకాలుగా విభజించబడ్డాయి.
మొదటి దశ - పూర్తిగా ఆసనము లోపలే ఉంటాయి.

రెండవ దశ - ఒక్క మల విసర్జన సమయములో బయటకు వచ్చి తర్వాత లోపలికి వెళ్ళదు.
మూడవ దశ - మలవిసర్జన సమయంలో బయటకు వచ్చిన మొ లలు దానికదే అవి లోపలికి వెళ్ళక చేతి వ్రేళ్ళలో నెట్టితే, ఆసన ములోకి వెళ్ళి ఏదా స్థానంలో ఉంటాయి.
నాల్గవ దశ - పూర్తిగా స్థాన భ్రంశము జరిగి, బయట ఆసవము దగ్గర ఉండి మలాశయమును బరువుగా బాధగా మారుస్తాయి.

3. నొప్పి: సహజంగా ఆర్శమొలలు నొప్పి కల్గించవు. కానీ అక్కడ సిరలులో రక్తస్కందము తయారవటం, గడ్డకట్టడం వలన, మరి యు భగేంద్రము వంటివి ఏర్పడినప్పుడు మాత్రమే తీవ్రమైన మంటతో కూడిన నొప్పి ఉంటుంది.

4. రక్తహీనత: అధిక రక్తస్రావము జరగటం వలన వస్తుంది.
హోమియోలో చికిత్స విధానం. సహజంగా ఆర్శమొలలు వ్యాధి తో బాధపడేవారికి హోమియోలో మంచి వైద్య విధానం ఉంది. ముఖ్యంగా ఆ వ్యాధితో అనుభవిస్తున్న వ్యక్తి యొక్క ప్రవర్తన తీరు ను, అతని జీవిన శైలి విధానాన్ని గమనించి ఆ వ్యాధి రావడానికి గల కారణాలను వెలికి తీసి, దీనితో పాటు ఆ వ్యక్తి ప్రస్తుత పరి స్థి తి, బాధపడే తీరు, అనగా ఆ మొలలు బాహ్యం లేదా అంతర్గత మొలలతో బాధపడుతున్నరా, లేదా రక్తస్రావం కల్గిందా? రక్త స్రా వం ఏ రకముగా ఉన్నది దానివల్ల అనుభవిస్తున్న మనిషి వ్య ద, బాధ, నీరసం, శక్తి హీనత, రక్తహీనత, వంటి లక్షణాలు మరియు మొలలు ఉన్న దశను, కూడ గుర్తించి అందుకనుగుణంగా చికిత్స ను ఆరంభించి వ్యాధి క్షణాలను తగ్గించడంతో పాటు వాటి ప్ర వృత్తి స్వభావమును కూడ నివారించవచ్చు.

ఉపయోగించే మందులు:
ఈ ముందులు రెండు రకాలుగా ఉంటాయి.

1. రక్తస్రావంతో కూడినవి :సహజంగా ఏసికులస్‌, అమోనియ్‌ కార్బ్‌, కాలి కేరియా ఫ్లోర్‌, కొలిన్‌ సోనియా, హీమామె లిస్‌, మిల్లిఫోలియమ్‌, మ్యూరెటిక్‌ ఆసి డ్‌, నైటిక్‌ ఆసిడ్‌, నక్స్‌వామికా పా స్‌ఫరస్‌.

2.బ్లైండ్‌, చప్పి డివి :ఏసికులస్‌, ఇగ్నిసియం, స ల్ఫ్‌ర్‌, కాప్సికమ్‌, హైపరికమ్‌, సైలీషియా, తూజ్‌

ఎసిక్యూలస్‌ : మూలవ్యా ది ప్రవృత్తి కలవారికి, సిరలు ఉబ్బేతత్వం కల వారికి, మలాశయంలో కట్టెపుల్లలు ఉన్నట్టుగా అన్పించే దురద, మల బద్దకం కల్గి చప్పిడి బా హ్య మొలలతో అప్పుడ ప్పుడు నొప్పితో నీటి రం గుగా మొలలు కలిగి విపరీత మైన నడుంనొ ప్పి, ఎప్పుడు చి కాకుగా, త్వరగా ఉద్రేకించి స్పం దించే వ్యక్తులకు ఇస్తారు.

ఏలోస్‌: మొలలు గుచ్చులుగా, ద్రాక్షగుచ్చి వలే అన్పించి, మూత్రా శయం ఏదో బరువును భరిస్తున్నట్లుగా ఉండి, దురద తాకితే వేడి గా, రక్తస్రావం జరుగుట విపరీతమైన వాము ఏర్పడటం మల వి సర్జన ఇబ్బంది ఉండి. సోమరిగా, ఏ పనిపై శ్రద్ద వహించని వారికి ఉపయోగిస్తారు.

కీలిన్‌ సోనియా: మానవ శరీర ధర్మశాస్త్రంలో ెపేర్కొనే కొన్ని సంధ ర్బాలలో ఏర్పడే రక్తచలన దోషం వలన ఏర్పడే మొలలు (ఉదా: గర్భదారణలో), దీర్ఘకాలికంగా మారి నొప్పితో, మంటతో రక్తస్రా వం జరిగే మొలలుగా మారి మలాశయంలో ఏదో ఉన్నట్లు కట్టె పుల్లలు, కంకర, మట్టి అని ఊహించుకోవడం, దాంతో చీము రక్తం బంకతో కూడ మలవిసర్జన జరగడం, కొద్ది చిన్నపాటి విష యాన్ని అయినా మానసికంగా త్వ రగా స్పందించి ప్రవర్తనలో తే డా చూసే వారికి ఇస్తారు.

హెమామెలిస్‌: రక్తనాళాలు త్వరగా స్పందించి సంకోచం చెందడం వలన ఏర్పడే రక్తచలనం గల తత్వం గలవారిలో ఆర్షమొలలు వె చ్చి విపరీతమైన అధిక రక్తస్రావం జరిగి, మంటతో, నొప్పితో ఆ సనం ప్రాంతం అంత ఎర్రగా, పుండువలె ఉండి, నీరసం, శక్తి లోపించిన వ్యక్తికీ ఉపయోగిస్తారు.

మ్యూరటిక్‌ ఆసిడ్‌: బాగా ఉబ్బి, నీలం రంగులో ఉన్న మొలలు మరీ సున్నితంగా ఉంటే తాకితే విపరీతమైన నొప్పి కల్గి మూత్ర విసర్జనలో స్థానభ్రంశము జరిగి మొలలు ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఏర్పడే వాటికి ఉపయోగిస్తారు.

నక్సీవామిక్‌ :సరైన జీవన శైలి లేకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేక మాంద్యంతో కూడిన ప్రవర్తన లు, మద్యపానీయాలకు, ధూమపానాలకు ఎక్కువగా అలవాటుపడిచిరాకు, కోపం, ఆవేశం, మూర్ఖ త్వంతో పాటు ఆశయం కోరుకునే వారికి ఇస్తారు. ప్రతిదీ శుభ్రంగా ఉంచుకునే, కోరుకునే వారిలో మల బద్ద ం లేదా తరుచు విరేచనాలు కలిగి వారి అలవాట్లు వల్ల ఏర్పడే మొలలకు ఎక్కువగా ఉపయోగిస్తారు.

డాక్టర్‌ ఎ.ఎం రెడ్డి
పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌
9290901010 www.positivehomeopathy.in

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement484
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us