
స్వైన్ ఫ్లూ... కొన్ని జాగ్రత్తలు
ఈ వ్యాధి ఇన్‌ఫ్లూయెంజా అ A,H,N వైరస్ వలన వస్తుంది. సాధారణంగా వర్షకాలం మరియు శీతకాలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది మనదేశంలో గత వర్షాకాలంలో మొట్ట మొదటిసారిగా కనబడింది. ఇప్పటి నుండి ఇది మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరము కనబడే ఆస్కారం ఉంది. ఈ వ్యాధి రాకుండా టీకాలు కనుగొన్నారు కాని అవి ఇంకా మార్కెట్‌లోకి రావడానికి సమయం పట్టవచ్చు. ఈ వైరస్ ప్రతి సంవత్సరము జన్యుపరమైన మార్పులు పొంది క్రొత్త జాతిగా రూపాంతరము చెందుతుంది అందు వలన టీకాలు ప్రతి సంవత్సరము కొత్తగా తయారు చేయవలసిన అవసరం ఉంది.
ఈ వ్యాధి ఒకరినుంచి వేరొకరికి దగ్గడము లేదా తుమ్మడము వలన ఏర్పడిన తుంపరలు గాలిద్వారా వ్యాప్తిచెంది సోకుతుంది లేదా వైరస్ కలిగిన తుంపరలు పడిన వస్తువువను కాని ఉపరితలమును గాని ముట్టుకొని మన ముక్కు లేదా నోరును రుద్దుకొనిన సోకవచ్చు ఒకసారి గాలిలోకి వ్యాపించిన వైరస్ వాతావరణ పరిస్థితులను బట్టి వస్తువులు మరియు ఇతర ఉపరితలముల మీద కొన్ని గంటల నుండి ఒక రోజు వరకు బతికి ఉండే అవకాశము ఉంది. ఈ వైరస్ సోకిన తరువాత వ్యాధి రాకముందు ఒక రోజు నుండి,వ్యాధి తగ్గిన తరువాత ఏడు రోజులు వరకు పిల్లలైతే 14 రోజులు వరకు, ఇంకొకరికి వాయపింపజేసే అస్కారం ఉంది.
ఈ వ్యాధి సొకిన వారిలో సాధారణంగా జ్వరము,తగ్గు ప్రొడిదగ్గు గోంతునొప్పి తలనొప్పి, ఒళ్ళునొప్పులు, అలసట, వాంతులు, విరేచనాలు ఆయాసము, జలుబు చేయడం, బద్ధకము, ఆకలి మందగించడం, దగ్గులో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి ఐదేళ్ళలోపు పిల్లలలో, 50 ఏళ్ళకన్నా పైబడిన వారిలో, గర్భిణి స్ర్తీలలో, ధీర్ఘకాలిక వ్యాధులతో, అనగా ఆస్థమా (ఉబ్బసము),ధీర్ఘకాలిక ఊపిరితిత్తుల జబ్బులన్నవారు గుండెజబ్బులున్నవారు చక్కర వ్యాధి (షుగర్) వ్యాధి, కేన్సర్ వ్యాధి (గస్థులు) ధీర్ఘకాలికంగా ఆస్పిరిన్ మందు వాడుతున్నరు మ్రూత పిండాల వ్యాధిగ్రస్థులు వారిలో ప్రమాద కరము కావచ్చు.
పిల్లలు ఊపిరి తీసుకోవడంలో ఇంబ్బంది పడుతున్నా లేదా త్వర త్వరగా ఊపిరితీస్తూ ఆయాస పడుతున్నా, చర్మము లేదా గోళ్ళు నీలిరంగులోకి మారినా సరిగా నీళ్ళు మరియు ఆహారము, ముందులు తీసుకోపోతున్నా వాంతులు తగ్గకపోయిన లేదా తీవ్రత పెరిగినా మత్తుగా ఉన్నా, ఇతరులతో సరిగ్గా కలవకపోతున్నా, చిరాకుగా ఉన్నా, మొదట ఫ్లూ లక్షణాలు వచ్చి తగ్గి మళ్ళీ జ్వరము లేదా దగ్గు తీవ్రత పెరిగిన వెంటనే అత్యవసర మరియు ఉధృత చికిత్స (ఇఐఖీఐఇఅఔ ఇఅఉ) వైద్యులని సంప్రదించాలి.
అదే పెద్దలలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాస పడుతున్నా పొట్టలో కాని ఛాతీలో కాని నొక్కితే నొప్పిగా ఉన్నా అనుకోకుండా లేదా ఒక్కసారిగా కళ్ళుతిరగడం మొదలైనా, మతిస్థిమితం లేకపోయినా (ఛిౌజఠటజీౌ), వాంతులు తగ్గకపోయినా లేక తీవ్రత పెరిగినా, ఫ్లూ లక్షణాలు వచ్చి తగ్గి మళ్ళీ జ్వరము,దగ్గు వస్తున్నా లేదా తీవ్రత పెరిగినా వెంటనే వైధ్యులని సంప్రతించాలి. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నావారు ఆసుపత్రిలో అవసరమైతే ఐఇ్ఖ లో ఉండటం మంచింది వారికి నరాల ద్వారా ద్రవములు (ఐగ జజూఠజీఛీట),ప్రాణవాయివు అవసరమైతే కృత్రిమ శ్వాస,మందులు మొదలగు అత్యవసర చికిత్సలు ఇవ్వవలసి ఉంటుంది.
జబ్బుకు సంబంధించిన ప్రత్యేక మందులు వ్యాధి లక్షణాలు కనపడిన 48 గంటలలోపు మొదలుపెడితే ప్రమాదాలను అరిట్టే అవకాశం ఉంది. జబ్బు బాగా ముదిరితే ప్రస్తుతం దొరికే మందుల పనిచేసే అవకాశం చాలా తక్కువ. ఈ వ్యాధిలక్షణాలు మరియు ఇతర పరిస్థితులను బట్టి ఎ1, బి1, బి2 మరియు సి అను కేటగిరీలుగా విభజించారు. తీవ్రత మరియు కేటగిరీని బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి. ఈ వ్యాధి లక్షణాలు కనపడినవారు ఇంట్లో ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకోవాలి. వారు వైద్యసేవలకు కొరకు తప్ప గదిలోంచి బయటకు రాకూడదు. పెద్దలైతే రోగలక్షణాలు తగ్గిన ఏడు రోజులవరకు, పిల్లలైతే 14 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలి.
పిల్లలను స్కూల్‌కు పంపించకపోతే మంచిది. రోజూ జ్వరం చెక్ చేసుకోవాలి. తీవ్రత పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. లక్షణాలు ఉన్నవారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ముక్కు మరియు నోరు రెండింటిని టిష్యూ పేపర్‌తో మూసుకోవాలి. వాడేసిన టిష్యూలను జాగ్రత్తగా ప్రత్యేకించిన చెత్తకుండిలో పారవేయాలి. టిష్యూ లేదా చేతిగుడ్డ లేనిచో చొక్క లేదా జాకెట్ మోచేతి మడతలోనికి తుమ్మడం, దగ్గడం చేయాలి. అన్నివేళలా... రోగలక్షణాలున్న వ్యక్తి మాస్క్ ధరించవలెను.
మాస్క్ ప్రతి అరగంటకొకసారి మార్చుకోవాలి. మాస్క్‌ను తరుచుగా ముందునుండి ముట్టుకోవద్దు (బయటి ఉపరితలం). మాస్క్‌ను వెనకనుంచి తీసివేయాలి. తీసివేసిన తరువాత చేతులు కడుక్కోవాలి. ఒక్కసారి వాడిన మాస్క్‌ను మళ్లీ వాడరాదు. మాస్క్‌ను ముఖం మీద గట్టిగా లీక్ లేకుండా పెట్టుకోవాలి. దగ్గినా, తుమ్మినా చేతులు వెంటనే కడుక్కోవాలి. స్పిరిట్ ను సబ్బునీళ్లకు బదులుగా వాడవచ్చు. సాధ్యమైనంత వరకు ముక్కు, కళ్ళు తరుచుగా రుద్దుకోకుండా ఉండడం మంచిది. వ్యాధి లక్షణాలున్న వ్యక్తిని ఇంట్లో ఎవరైతే... చూసుకుంటారో వారు తరుచుగా చేతులు కడుక్కోవాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వ్యాధిగ్రస్తుని బట్టలుగాని, వస్తువులు 8 శాతం హైసోక్లోరైడ్ ద్రావంతో ఒక గంట పాటు నానబెట్టి తరువాత ఉతకడం గాని, కడగడం గాని చేయాలి.
బట్టలు గాని దగ్గరగా హత్తుకొని తీసుకెళ్ళరాదు. దేహానికి దూరంగా పట్టుకోవాలి. తరుచుగా వస్తువులు మరియు ఇతర ఉపరితలములని యాంటిసెప్టిక్‌లో ముంచిన గుడ్డతో తుడుచుకోవాలి. బాత్‌రూంని రోజూ కడుక్కోవాలి. పబ్లిక్ ప్రదేశాల్లో సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు నల్లాలు, తలుపులను తాకకుండా జాగ్రత్తపడాలి. లేదా వెంటనే చేతులు కడుక్కోవాలి. వ్యాధిగ్రస్తులు నీరు, పళ్ళ రసాలు మొదలగునవి సాధ్యమైనంతవరు ఎక్కువగా తీసుకోవాలి.
డాక్టర్ రవీంద్ర నల్లగొండ
ఎం.డి (ఎఫ్.సి.సి.ఎమ్), ఐ.డి.సి.సి (ఐ.ఎస్.సి.సి.ఎమ్)
కన్సల్టెంట్ ఇన్ పల్మోనాలజీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్
అవేర్ గ్లోబల్ హాస్పిటల్
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































