
అంగస్తంభనలు సడన్‌గా ఆగిపోతే?
ప్ర: నాకు 12 ఏళ్ళ వయస్సునుండి హస్త ప్రయోగం అలవాటు ఉంది. ప్రతిరోజు నాలుగుసార్లైనా హస్తప్రయోగం చేస్తుంటా ను. కొందరు హీరోయిన్ల ఫొటోలు చూసినప్పుడు వెంటనే హస్తప్రయోగం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు నా వయస్సు 21 సంవత్సరములు. అయితే ఇటీవలికాలంలో నా అంగస్తంభనలలో తేడాలు వచ్చాయి. ఈ మధ్య సెక్స్ ఆలోచనలు కూడా సరిగా రావడంలేదు. ఏదైనా సెక్సీ ఫొటోను తదేకంగా చూస్తూ... ఎక్కువసేపు ఆలోచించినప్పుడు కొద్దిగా స్తంభిస్తుంది కాని బలంగా ఉండటంలేదు. అయితే తెల్లవారు జామున మాత్రము అంగస్తంభనలు మామూలుగానే ఉంటాయి. ఈ సమస్య గురించి ఇటీవలే ఒక డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన దానికోసం కొన్ని రకాల మందులు ఇచ్చాడు. నెలరోజులపాటు వాడాను. అయినా ఫలితం శూన్యం. సడెన్‌గా నాలో ఈ మార్పు ఎందుకు వచ్చింది. ఇంట్లో నాకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళి చేసుకుంటే నేను నా భార్యను సుఖపెట్టగలనా అని భ యపడుతున్నాను. ఆ మధ్య నా స్నేహితుడొకాయన హస్తప్రయోగం చేస్తే సెక్స్ సామర్థ్యం తగ్గుతుందిని చెప్పాడు అది నిజమేనా? అలా అయితే ఇక నేను సెక్స్‌కు పనికిరానా?
- ఆర్.ఎస్, పెగడపల్లి
జ: ముందు చెప్పుడు మాటలను వినడం మానేయండి. మీ స్నేహితుడు ఏమైనా వైద్యుడా మీకు సలహాలు ఇవ్వడానికి. హస్తప్రయోగం వలన సెక్స్ సామర్థ్యం తగ్గుతుందనడాన్ని ఈ భూగోళంలో ఏ వైద్య నిపుణుడు కూడా సమర్థనించడు. ఇప్పటివరకు దానికి సంబంధించి ఎటువంటి సైంటిఫిక్ ఆధారాలు కూడా లేవు. అనవసరంగా చెప్పుడు మాటలు విని మీరే మానసికంగా ఒక భయాన్ని ఏర్పరుచుకున్నారు. మీకు ముందువరకు అంగస్తంభనలు సక్రమంగా ఉన్నాయన్నారు. ఆ తరువాత సడెన్‌గా ఆగిపోయాయిని రాశారు. అయితే మీకు ఏదైనా శారీరక సమస్య ఉందా అనే విషయం గురించి మాత్రము రాయలేదు. కొన్నిసార్లు హార్మోన్ల తగ్గుదల వలన ఇలాంటి సమస్య రావచ్చు. ఒకవేళ మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటే మాత్రం అది ఖచ్ఛితంగా మీరు మానసిక ఆందోళనలో ఉన్నారని అనిపిస్తోంది. నాకు తెలిసి మీ స్నేహితుడు హస్తప్రయోగం వలన సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పినప్పటినుండే ఇలా జరిగి ఉండవచ్చుననిపిస్తుం ది. ముందు మీ మనసులో నుంచి అలాంటి అపోహలను తీసివేయండి. చక్కగా పెళ్ళి చే సుకోండి. మీ భార్యను వంద శాతం సుఖపెట్టగలరు. అనవరసరం గా ఆలోచించి సమస్యను భూతద్దంలో చూడవద్దు. అలాంటి ఆలోచనలు తీవ్రంగా ఉంటే మానసిక వైద్య నిపుణుడిని సంప్రదించి సలహా తీసుకోండి. ఇకపై చెప్పుడు మాటలను వినొద్దని నా సలహా.
ప్ర: నాకు మధ్యనే పెళె్ళైంది. వయస్సు 22 ఏళ్ళు. మా స్నేహితలు చెబితే ఫస్ట్‌నైట్ గురించి ఎంతో అందంగా ఊహించుకున్నాను. ఎ న్నో ఆశలతో సంసారజీవితాన్ని సుఖమయం చేసుకోలానిక మొదటిరాత్రి బెడ్‌రూంలోకి అడుగుపెట్టిన నాకు అన్నీ అవాంతరాలే ఎదురయ్యాయి. సున్నితత్వమే లేని మోటుమనిషి బెడ్‌రూంలోకి వెళ్ళగానే ఓ ముద్దు ముచ్చట లేకుండా అమాంతం మీదపడి వివస్తన్రు చేసి సెక్స్ చేశాడు. బలంగా అంగప్రవేశం చేయడంతో నాకు నరకం కనడపడింది. నొప్పిగా ఉందని ఎంత చెప్పినా వినలేదు. ఎంతవారించి నా తెల్లవార్లు నాలుగైదుసార్లు సెక్స్ చేశాడు. దాంతో యోని అంతా వాచిపోయింది. ఆ తరువాత ‘సారీ... నా కోరికను అదుపుచేసుకోలేకపోయాను. నీ బాధ తగ్గేవరకు మళ్లీ సెక్స్ చేయను’ అన్నాడు. ఆ త రువాత నేను పుట్టింటికి వచ్చేశాను. ఇప్పుడు మళ్లీ నన్ను అత్తవారింటికి పంపిస్తామంటున్నారు. నాకేమో చాలా భయంగా ఉంది. ఏమి చేయను?
- కె.కె, వైజాగ్
జ: సెక్స్‌కు ముందు ఫోర్‌ప్లే చాలా ముఖ్యం. మానసికంగా సిద్ధమవ్వకుండా సంభోగానికి రెడీ అయితే ఇలాంటి సమస్యలే వస్తాయి. మీ వారికి ప్రణయ కళ ఏమిటో తెలియ దు. అయితే ఇన్నాళ్ళూ బ్యాచిలర్ లైఫ్ అనుభవించిన అతనికి సెక్స్ కోరికలు ఒక్కసారిగా పడగవిప్పినట్టున్నాయి. ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలా చేస్తే బాగుంటుందో మీవారికి వివరించండి. నాకు తెలుసి మీ వారు మీ పట్ల పరోక్షంగా ప్రేమను ప్రదర్శించారు. మీకు నొప్పి తగ్గేవరకు మళ్లీ సెక్స్ చేయనన్నాడంటే ఆయనకు మీపట్ల ప్రేమ ఉందనేగా అర్థం. కావున మీరు మీ ఆయనకు మంచిగా చెబితే అర్థం చేసుకుంటాడు. సెక్స్‌లో ఎలాంటి దాప రికాలు ఉండకూడదు. ఒకరినొకరు అర్థం చేసుకోండి.
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































