
అమర జవాన్లకు జోహార్లతో.. సరి
జనని జన్మ భూమిశ్ష... స్వర్గదపి గరియేసి.. ఏ తల్లి నిన్ను కన్నదో... ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా.. అంటూ ఓ సినీ కవి తన పాటతో జవాన్ల గొప్పతనాన్ని వివరించాడు. దేశం రక్షణ కోసం అహార్నిశలు సరిహద్దుల్లో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి జవాన్ల సంక్షేమం కోసం ఎంత చేసిన తక్కువే అవుతుంది. కర్తవ్వ నిర్వహణలో ప్రాణాలర్పించిన ఎందరో వీరజవాన్లు వారందరికి వందనాలు... సైనికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న వాటిలో కొన్ని ఇప్పటికి వీర జవాన్ల కుటుంబాలకు అందక సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాల చుట్టు ఏళ్ల తరబడి తిరుగుతున్నారు.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారి మాటల్లోనే...
ప్రభుత్వ స్థలం ఇప్పటికి అందలేదు...
‘‘నా భర్త రాంచందర్ 1994 అక్టోబర్ 24వ తేదీన మిలటరీలో లయన్స్ నాయ క్‌గా చేరాడు. అప్పటి నుండి ఐదు సంవ త్సరాల పాటు దేశ రక్షణ కోసం సరిహ ద్దుల్లో కర్తవ్యం నిర్వహించాడు. 1999 సంవత్సరంలో పాకిస్తాన్ - ఇండియాకు మద్య జరిగిన కార్గిల్ యుద్ధంలో నా భర్త రాంచందర్ వీరమరణం పొందాడు. అప్పుడు ప్రభుత్వం తమకు 300 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్థలం కేటాయించలేదు. స్థలం విషయం పై ఎన్నో మార్లు అధికారుల చుట్టు తిరిగినప్పటికి పట్టించుకోలేదు. ఇప్పటికైన ప్రభుత్వాలు స్పందించి తనకు ఇవ్వాల్సిన స్థలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
- వీర జవాను రాంచందర్ భార్య దివ్వ, ఆదర్శనగర్ బొల్లారం.
ఇప్పటికి ప్రభుత్వాల నుండి బెనిఫిట్స్ అందలేదు...నా భర్త వీర జవాను ఎస్. మాధవ్‌పెరుమాళ్ 1983 జులై 13వ తేదీన ఆర్మీలో డాక్టర్‌గా చేరాడు. 26 సంవత్సరాలుగా మిటరీ లో డాక్టర్‌గా అనేక సేవలు అందించారు. పలు యుద్ధాలలో పాల్గొ ని గాయపడ్డ సైనికులకు విలువైన వైద్య పరీక్షలను అందించి వారి ప్రాణాలను కాపాడారు. 2009 జులై 13వ తేదీన అస్సాం - తేజ్‌పూర్‌లో జరిగిన ఐఈడీ బ్లాస్ట్‌లో వీర మరణం పొందారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పటి వరకు తనకు అందలేదు.
- ఎస్. గీతామాధవ్, వీరజవాను ఎస్. మాధవ్‌పెరుమాళ్ భార్య.
బెనిఫిట్స్ అన్నీ అందజేస్తున్నాం...
వీరజవాన్ల కుటుంబాలకు ప్రభుత్వాల పరంగా అందజేసే అన్ని బెనిఫిట్స్‌ను అందజేస్తున్నాము. మరణించిన జవా నుకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే 5000 రూపాయల ఎక్స్‌గ్రేషియో ఫండ్‌తో పాటు 100 గజాల ఇంటి స్థలం, 5 ఎకరాల భూమి, భూమి లేని పక్షంలో తదాను గునంగా నగదు ఇప్పించడం జరుగుతుంది. కేంద్ర ప్రభు త్వం అందజేసే స్పెషల్ ఫ్యామిలీ పెన్షన్, అర్హతను బట్టి కుటుంబ సభ్యులకు ఉద్యో గం, పెట్రోల్ బంక్‌ల కేటాయింపు, పని చేసే యూనిట్ ద్వారా అడక్ రిలీఫ్ ఫండ్ తదితర సౌకర్యాలను అందజేస్తున్నాము.
- స్వర్ణ కుమారి, హైదరాబాద్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్.
- వెంకట్, సతీష్ - మోండా, వారాసిగూడ (మేజర్‌న్యూస్)
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































