Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
తీరరక్షణలో.... మన బలమెంత?

ICG-Flag60వ దశకంలో సముద్ర జలాల గుండా దోపిడీలు ఎక్కువగా జరుగుతుండేవి. ఇది భారత ఆర్థిక వనరులను విపరీతంగా దెబ్బతీసింది. వీటిని అదుపు చేయడానికి భారత ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితంలేకుండా పోయింది. ఇలాంటి అవాంతరాలు ఎదురైన ప్రతిసారీ భారత నావికదళ సేవలను వాడుకునేవారు. కానీ, దీర్ఘకాలంలో ఇది అంత పటిష్టమైన మార్గం కాదని భావించిన భారతప్రభుత్వం... తీర రక్షణకోసం నావికాదళంలోనే ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని భావించి ఆ దిశగా కొన్ని నిర్ణయాలు చేపట్టింది. సముద్ర దోపిడీలపై పరిశీలనకు భారత నావికా, వైమానికి దళాల సహాయంతో... నాగ్‌ చౌదురి నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది.

Moraji1అన్ని కోణాలను పరిశీలించిన తరువాత, సుదీర్ఘ చర్చల అనంతరం... ఒక నిర్ణయానికి వచ్చిన మిటీ... తీరరక్షణకోసం ఒక ప్రత్యేక విభాగం ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. అలా ఏర్పడినదే ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌’. 1971లో ఏర్పడిన నాగ్‌ చౌధురి కమిటీ ఈ విభాగానికి పునాదులు వేశారు. ఏడేళ్ళ సుదీర్ఘ పరిశీలన తరువాత ఆగస్ట్‌ 18, 1978వ సంవత్సరంలో... ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 1, 1977 లో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయి. భారత నావికా దళం సహాయంతో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు, ఐదు గస్తీ బోట్లను ఏర్పాటుచేసుకుంది. దీంతో ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ చరిత్రలో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్టయింది. అప్పటినుండి ఈ రోజును ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డే’ జరుపుకుంటున్నాం.

సుమారు 7500 కి.మీ తీరప్రాంతం కలిగి న ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కు 2 మిలియన్ల చదరపు కి.మీ. సముద్రప్రాంతం ఆధీనంలో ఉంది. ఐదువేలకు పైగా ఉద్యోగులతో... 29 కోస్ట్‌గార్డ్‌ స్టేషన్స్‌, 5 ఎయిర్‌బేస్‌లు, 48 అత్యాధునిక గస్తీ నౌకలు, 22 ఇంటర్‌కాప్టర్‌ వెస్సల్స్‌, 6 హోవర్‌క్రాఫ్ట్‌లు, 24 విమానాలు, 21 హెలీకాప్టర్లతో... అమెరికా, ఇంగ్లాండ్‌ల తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద తీరరక్షక దళంగా పేరుగాంచిన ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌’ ఇప్పటికి 32 వసంతాలు పూర్తిచేసుకొని విజయవంతంగా పూర్తిచేసుకుంది. అయనప్పటికీ... ఇప్పటికీ ఇంకా ఎంతో అభివృద్ధి సాధించాల్సి ఉంది. తీరరక్షణలో ఇప్పటికీ మనం వెనకబడి ఉన్నామనడానికి ఇటీవల పెరుతున్న ఉగ్రవాద చొరబాట్లే నిదర్శనం.

HMS-Astute,-the-first-nucleఏర్పాటు జరిగిందిలా:
నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల సహకారంతో నాగ్‌ చౌధురి నేతృత్వంలోని కమి టీ ఆగస్ట్‌ 1971లో కొన్ని తీరరక్షణ విషయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను గుర్తించింది. తీర ప్రాంతం వెంబడి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందన్న విషయం ప్రభుత్వానికి నివేదించింది. చేపల వేటకు ఉపయోగించే నౌకలకు అధికారిక గుర్తింపునివ్వడం ద్యారా అసాంఘీక కార్యకలాపాలకు చెక్‌ చెప్పవచ్చనీ, దీనివల్ల అనుమతిలేకుండా తీరప్రాంతం వెంబడి తిరిగే పడవలను గుర్తిం చడం సాధ్యమవుతుందని తెలియజేసింది. అంతేకాకుండా తీరప్రాంత గస్తీని కూడా పెంచాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసింది.

1973లో కమిటీ సూచనలమేరకు భారత ప్రభుత్వం అంతర్గత భద్రత చట్టాన్ని అనుసరించి గస్తీ దళాలను నియమించడం పై దృష్టిసారించింది. అంతేకాకుండా అందుకు తగిన వనరులను కూడా ఏర్పాటు చేయడం లో తగు నిర్ణయాలను తీసుకుంది. అప్పటి చీఫ్‌ నావల్‌ స్టాఫ్‌ 1974 ఆగస్ట్‌ 31న కేబినెట్‌ సెక్రటరీకి ఒక నివేదికను సమర్పించారు. దానిని ఆధారంగా చేసుకొని 1974 సెప్టెంబర్‌లో భారత నావికా దళం నేతృత్వంలో రుస్తాంబీ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇండియన్‌ కో స్ట్‌ గార్డ్‌కు ఒక స్వరూపాన్నిచ్చింది. అంతేకాకుండా కో స్ట్‌ గార్డ్‌కు సంబంధిన విధి విధానాలను కూడా ఆ కమి టీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. తొలుత హోంశా ఖకు ఈ బాధ్యతలను అప్పగించినప్పటికీ... ఆ తరువా త ఇందిరాగాంధీ హయాంలో ఈ బాధ్యతలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించింది.

Sankalpఅప్పటినుండి ఇప్పటివరకు కేంద్ర రక్షణ శాఖలో ఆర్మీ, వైమానికి, నావికాదళాలతో పాటు కేంద్ర రక్షణ విభాగంలో ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌’ను కూడా ఒక భాగంగా చేర్చారు. అప్పటినుండి ఇప్పటివరకు దినదినాభివృద్ధి చెందు తూ... ఎప్పటికప్పుడు ఆధునిక నౌకా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకుంటూ... అప్రతిహతంగా సాగుతున్న ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌’ ప్రపంచంలోనే ఉత్త మ తీరరక్షణ దళాల్లో ఒకటిగా గుర్తింపుపొందింది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్నప్పటికీ నేటికీ తీరప్రాంత రక్షక దళంలో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టు క నబడుతున్నాయి. దీని వెనక అనేక కారణాలున్నాయి.

26/11 ముంబాయి దాడులు:
2008 నవంబర్‌ 26వ తేదీన ఆర్థిక రాజధాని ముంబాయి పైన జరిగిన ముష్కరుల దాడి తరువాత తీరప్రాంత భద్రతపై ఎన్నో అనుమానాలు వెల్లువెత్తాయి. ప్రపంచంలోనే పేరెన్నికగన్న తీరగస్తీ దళం మన సొంతమైనప్పటికీ అందులో ఉన్న కొన్ని లోపాలను ఆసరగా చేసుకొని పాకిస్తాన్‌ టెర్రరిస్టులు ముంబాయి మహానగరంలో ప్రవేశించి మహా రక్తపాతాన్ని సృష్టించారు. సుమారు 173 మందిని పొట్టనబెట్టుకు న్న ఆ సంఘటనలో ఎంతోమంది పోలీసు అధికారు లు సైతం తమ ప్రాణాలను కోల్పాయారు. ఆ విషాద సంఘటన తరువాత ప్రాణాలతో చిక్కిన ఏకైక తీవ్రవాది అజ్మల్‌ కసబ్‌ను విచారించిన పోలీసులకు తీరప్రాంత గస్తీ వ్యవస్థలోని లోటుపాట్లు కొట్టొచ్చినట్టు కనడినాయి.

Cgcell19772ఇన్వెస్టిగేషన్‌ రిపోర్ట్‌ ప్రకారం దాడికి పాల్పడిన ముష్కరులు కరాచీ నుండి అరేబిమా సముద్రం గుండా బయలుదేరి ‘కుబేర్‌’ అనే ఒక ఫిషింగ్‌ బోటును నడుపుతున్న నలుగురు వ్యక్తులను కూడా హతమార్చడం ద్వా రా ఆ బోటును స్వాధీనం చేసుకున్న టెర్రరిస్టులు ఆ బోటు కెప్టెన్‌ను బెదిరించి దానద్వా రా ముంబాయి తీరానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆ కెప్టెన్‌ కూడా చంపేసిన దుండగులు అతి సులభంగా ముంబాయి మహానగరంలోకి ప్రవేశించారు. ఆ తరువాత వారు సృష్టించిన రక్తపాతం మనందరికీ తెలిసిందే.
ఈ సంఘటన తరువాత మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలకు పూనుకుంది. తీరప్రాంత గస్తీని పెంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను చేపట్టింది. దేశం చుట్టూ ఉ న్న అన్ని తీరప్రాంత స్టేషన్లలో గస్తీ దళాల ను పెంచడమే కాకుండా మ రిన్ని అన్ని దళాలను కోస్ట్‌ గార్డ్‌ దళాలను అప్రమత్తం చేసింది. అధునాతన జలంతర్గాములను సమకూర్చుకుంది. ఇటీవల జలప్రవేశం చేసిన పలు అధునాత జలాంతర్గాములలో ఎక్కువశాతం తీరప్రాంత గస్తీకోసం నిర్దేశించినవే కావ డం గమనార్హం.

ఇదీ తీర రక్షణ వ్యవస్థ:
ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ను నా లుగు రీజియన్లుగా విభజించారు. వెస్ట్రన్‌, ఈస్ట్రన్‌, నా ర్త్‌ వెస్ట్‌ రీజియన్‌, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ రీజియన్‌. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుండగా... వెస్ట్రన్‌ రీజియన్‌ హెడ్‌క్వార్టర్‌ ముంబాయిలోనూ... ఈస్ట్రన్‌ రీజియన్‌ హెడ్‌క్వార్టర్‌ చెనై్నలోనూ... ఏ అండ్‌ ఎన్‌ రీజియన్‌ హెడ్‌క్వార్టర్‌ పోర్ట్‌బ్లెయిర్‌లోనూ ఉంది. ఇక నార్త్‌ వెస్ట్‌ రీజియన్‌ గాంధీనగర్‌ వేదికగా పనిచేస్తుంది. ఇప్పటివరకు ‘ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌’లో 5440 మంది రక్షక దళంతోపాటు 633 మంది అధికారులు పనిచేస్తున్నారు. భారత నావికాదళంలో వైస్‌ చీఫ్‌ అడ్మిరల్‌ హోదా గల వ్యక్తి ఈ సంస్థకు ముఖ్య అధికారిగా ఉంటారు. ఆయనను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కోస్ట్‌ గార్డ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం వైస్‌ అడ్మిరల్‌ అనిల్‌ చో ప్రాఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవరిస్తున్నారు. నాలుగు విభాగాలలో ఒక్కో విభాగానికి ఒక ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌, ఒక డిప్యూటి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ముఖ్య అధికారులగా వ్యవహరిస్తారు. ఐజీ, డీఐజీలను కోస్ట్‌ గార్డ్‌ ఆఫీసర్స్‌గా వ్యవహరిస్తారు.

Morajiఆయుధ సంపత్తి:
29 కోస్ట్‌ గార్డ్‌ స్టేషన్లు, డామన్‌ మరి యు చెనై్నలలో రెండు ఎయిర్‌ బేస్‌లు, గోవా, కోల్‌క తా, పోర్ట్‌బ్లెయిర్‌లలో రెండు ఎయిర్‌బేస్‌ కలిగి ఉన్న ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అమ్ముల పొదిలో అత్యాధునిక నౌ కలు చాలానే ఉన్నాయి. జలాంతర్గాములకంటే ఎక్కువగా సముద్ర ఉపరితలంపైన వెళ్ళగలిగే నౌకలే ఎక్కువ గా ఉన్నాయి. అందులో కొన్ని స్వదేశీ సాంకేతక పరిజ్ఙానంతో తయారైనవి కాగా కొన్ని విదేశీ పరిజ్ఙానంతో త యారు చేసన నౌకలు కూడా ఉన్నాయి. వీటిలో సంక ల్ప్‌ క్లాస్‌కు చెందిన ‘అడ్వాన్స్‌డ్‌ ఆఫ్‌షోర్‌ ప్యాట్రోల్‌ వెస్సెల్స్‌ రెండు ఉన్నాయి. ఇవేకాకుండా విశ్వస్ట్‌ లాంటి మరి కొన్ని అత్యాధునిక నౌకలు కూడా త్వరలో జలప్రవేశం చేయనున్నాయి. ఇక ఎయిర్‌క్రాఫ్ట్‌ల విషయానికి వస్తే... హాల్‌ ధృవ్‌, లాంటి అత్యాధునికి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి.

ఇంత అంగ, ఆయుధబలం ఉన్నప్పటికీ తీర రక్షణలో ఇప్పటికీ లోటుపాట్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవలికాలంలో తీరరక్షణపై దృష్టిసారించి అనేక నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామమే.



కోస్ట్‌ గార్డ్‌ ర్యాంక్‌ భారత నావికా దళంలో సమాన హోదా
డైరెక్టర్‌ జనరల్‌ వైస్‌ అడ్మిరల్‌
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌
(మూడేళ్ళ సీనియారిటీ) కమెడోర్‌
డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కెప్టెన్‌
కమాండెంట్‌ కమాండర్‌
కమాండెంట్‌ (జూనియర్‌ గ్రేడ్‌) కమాండర్‌
డిప్యూటీ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ కమాండర్‌
అసిస్టెంట్‌ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌
అసిస్టెంట్‌ కమాండెంట్‌
(ఫేస్‌-3 ఎఫ్లోట్‌ ట్రైనింగ్‌ తరువాత) యాక్టింగ్‌ లెఫ్టినెంట్‌
అసిస్టెంట్‌ కమాండెంట్‌
(ఫేస్‌-2 ఎఫ్లోట్‌ ట్రైనింగ్‌ తరువాత) మిడ్‌షిప్‌మన్‌

- ఎస్‌.కె

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement464
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us