Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
‘దిష్టిబొమ్మల’ దానయ్య

కాలక్షేపానికి నేర్చుకున్న విద్యే నేడు అతనికి పేరు తెచ్చిపెట్టింది. తనతో పాటు మరో నలుగురికి ఉపాధిని కల్పించింది. దీంతో తన వృత్తి పేరే ఇంటిపేరుగా మారింది. ఇంత పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టడానికి కారణమైన దిష్టిబొమ్మల విద్య ఎలా నేర్చుకున్నారు... ఆ విషయాల్ని దానయ్యని అడిగి తెలుసుకుందాం.

సై్మల్‌ప్లీజ్‌ : దిష్టిబొమ్మలు చేయడం ఎలా నేర్చుకున్నారు?
దానయ్య : చిన్నప్పుడు బర్రెలు కాసేటప్పుడు ఏం తోచకపోతే గడ్డి తో బొమ్మలు చేసేవాణ్ణి. దానికి మా యజమాని చొక్కా వేసి దాన్ని తిట్టి, కొట్టి తగలబెట్టేవాళ్లం. ఇంతే కాకుండా మా దోస్తులందరూ వాళ్ల యజమాని బొమ్మచేయమని అడిగేవారు. అలా నా దిష్టిబొ మ్మల ప్రయాణం మొదైలైంది.

సై్మల్‌ప్లీజ్‌ : ఎప్పుడు వెలుగులోకి వచ్చారు?
దానయ్య : మా దోస్తుల వల్ల మా ఊరి వాళ్లకి నేను దిష్టిబొమ్మల ను చేస్తానని తెలిసిపోయింది. ఏ కొత్త భవనం నిర్మా ణం మొదలు పెట్టినా... బొమ్మ కోసం నా వద్దకు వచ్చేవారు. దాంతో నా టాలెం ట్‌ చుట్టుపక్కల గ్రామాలకు ప్రాకింది.

సై్మల్‌ప్లీజ్‌ : ఇప్పుడు బిజీగా ఉన్నట్లున్నారు?
దానయ్య : అవునండీ దాదాపు రెండు నెలల నుంచి రాష్ట్రంలో పరి స్థితుల వల్ల పెద్దవాళ్ల దగ్గర నుంచి పదుల సంఖ్యలో... దిష్టిబొ మ్మలు ఆర్డర్లు వస్తున్నాయి. కాబట్టి తీరకలేకుండా ఉన్నాను.

సై్మల్‌ప్లీజ్‌ : కొంతమందికి ఉపాధి కల్పించారంట?
దానయ్య: దాన్ని నేను ఉపాధి అని చెప్పుకోను. ఈ కళపై అభిమా నం ఉన్న వారు నా వద్ద నేర్చుకుంటున్నారు. ఎటువంటి ఫీజు లే కుండా వారికి నేను ఉచితంగా నేర్పిస్తున్నాను. వారిని ప్రోత్సహిస్తు న్నాను.
మీకు మరిన్ని ఆర్డర్లు రావాలని, మరింత మందికి ఉపాధినివ్వా లని ‘సై్మల్‌ప్లీజ్‌’ కోరుకుంటూ... సెలవుతీసుకుంటోంది.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement471
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us