
సినీ పరిశ్రమ దైవంతో సమానం : తడివేలు
ప్రేక్షకులకు వినోదాన్ని అందించే సినీ పరిశ్రమలో అన్ని సుఖాలే వుంటాయనేది సామాన్య ప్రజల నమ్మకం. సినిమా పరిశ్రమలో అన్నీ రాజభోగాలే అని చాలామంది నమ్ముతుంటారు. కానీ అలాంటి అలోచనలో ఎంత మాత్రం నిజం లేదన్నది అక్షరసత్యం. ఒకరు హీరో అయిపోదామని, మరొకరు దర్శకుడిగా ఎదగాలని, ఇలా ఎన్నో ఆశలతో తెలుగు సినిమా పరిశ్రమకు గడపలాంటి కృష్ణానగర్‌కు చేరుకుంటారు. చేరుకున్న తరువాత వారికి అసలు విషయం తెలుస్తుంది. అయినా వారిలో ఏ మాత్రం ఆశ చావదు. దానికి కారణం ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్దలుగా వెలుగొందుతున్న వారంతా గతంలో ఇంతకంటే కష్టాలు చవిచూసిన వారే కావడం గమనార్హం. తడివేలు కూడా అలా వచ్చినవాడే...
తమిళ హాస్యనటుడు వడివేలుకు దగ్గర పోలిక లున్న కమేడియన్ తడివేలు. అసలుపేరు ఇజ్రాయేలు. ఖమ్మం జిల్లా మణుగూ రు మండలానికి చెందిన సౌభాగ్య మ్మ, నమూయేల దంపతుల సంతా నం ఇజ్రాయేలు (తడివేలు). తండ్రి సింగరేణిలో ఉద్యోగి. తల్లి గృహిణి. ఆయనకు ఇద్ద రు చెల్లెళ్ళు. ఇద్దరికీ పెళ్ళిల్లయ్యాయి. ఒక్క కొడుకు అని తల్లిదండ్రులు గారాం చేస్తే స్కూలుకు పోనని మారాం చేసి ఏడవ తర గతిలోనే చదువుకు పుల్‌స్టాఫ్ పెట్టాడు. అప్ప టినుంచి వడివేలు డాక్టర్ రాజశేఖర్‌కు వీరా భిమానిగా మారాడు.
ప్రయాణం సాగిందిలా: రాజశేఖర్ హీరో గా నటించిన ‘అల్లరి ప్రియుడు’ సినిమా షూ టింగ్ చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన తడి వేలు ఎలాగైనా సినీపరిశ్రమలో ఉండాలని అను కున్నాడు. ఇక్కడ కొనసాగాలంటే ఏదో ఒక పని చేయాలని గతంలో నేర్చుకున్న డ్రై వింగ్ వృత్తిని ఎంచుకున్నాడు. ప్రఖ్యాత నటుడు ప్రభాకర్ రెడ్డి, నిర్మాత డి.డి ప్రసాద్, హా స్యనటుడు అలీ వద్ద డ్రైవర్‌గా కొ న్నాళ్లు పనిచేశాడు. ఆనంతరం అప్పట్లో హైదరాబాద్‌లో డాన్సర్‌లు చాలా తక్కువగా ఉండడంతో డాన్సర్స్ యూనియన్‌లో రం గప్రవేశం చేసి కొంతకాలం డాన్సర్‌గా పనిచేశాడు (లారెన్స్ సినిమాల్లో డాన్సర్‌గా పనిచేశాడు).
ఎం.ఎస్.రెడ్డి సహకారంతో...: తనలో దాగి వున్న టాలెంట్‌ను చూపించాలన్న సంకల్పంతో నటుడి అవతారం ఎత్తాడు. ఒక్కపలచగా ఉన్న తడివేలుకు తగ్గట్టుగా హెయిర్ డ్రెస్సర్ స్వామి తన పనితనంతో తమిళ నటుడు వడివేలు తరహాలో ఆకారాన్ని మార్చేశాడు. అప్పటినుంచి ప్రయత్నాలు ప్రారంభించిన తడివేలుకు ‘అందం’ సినిమాలో తొలిసారిగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతో సీనియర్ నిర్మాత ఎం.ఎస్. రెడ్డి, దర్శకుడు శ్రీనివాసరెడ్డి కలిసి అతనికి తడివేలు అని పేరు పెట్టారు. కమెడియన్లకు తమ్ముడుగా, బావమరిదిగా, అసిస్టెంట్‌గా, పిచ్చివాడు లాంటి ప్రత్యేక పాత్రలు చేశారు. ఇలా ఇప్పటి వరకు దాదాపు పాతిక సినిమాలు చేశారు.
మరచి పోలేని సంఘటన: ఈమధ్య నటిం చిన సినిమాల్లో ఎక్కువగా గుర్తింపు తెచ్చి పెట్టిన పాత్ర ‘భూ కైలాస్ - ఎకరం యాభై కో ట్లు’. ఆ సినిమాలో రఘుబాబు అసిస్టెంట్‌గా వేసిన పాత్ర. ‘పిల్ల దొరికితే పెళ్ళి’ సినిమా షూటింగ్‌కు విజయవాడకు వెళ్ళినప్పు డు నన్ను జనం గుర్తుపట్టి అటోగ్రాఫు లు తీసుకున్నాను. నా జీవితంలో నే ను మరచిపోలేని సంఘటన అది. కష్టపడితే సాధించలేనిది ఏది లేదని నేను నమ్ముతాను. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14ఏళ్లు పూర్తయ్యాయి. ఆర్టిస్టుగా నాలుగేళ్ళు పూర్తయ్యాయి. కష్టపడి పైకొచ్చిన ప్రముఖలు ఆలీ, వడివేలు గార్లు నా కు ఇన్‌స్పిరేషన్.
సినీ పరిశ్రమనే నమ్ముకున్నా: ‘‘సినిమాలో బక్కగా వు న్న క్యారెక్టర్ కావాలంటే నన్ను పిలుస్తారు. ఇలా పరిశమ్ర ను నమ్ముకుని బ్రతుకుతున్నాను. సినిమాలే నాప్రాణం. టా ప్ కమెడియన్‌లలో నిలవాలన్నదే నా ఆశ. ఆది తీరినా తీర కపోయినా పరిశ్రమలోనే కొనసాగుతాను. నా నటనను చూసి అమ్మా నాన్నలతో పాటు ఆలీ, తనికెళ్ళభరణి, శివాజీ రాజా, యం.ఎస్.నారాయణ తదితరులు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు.’’ అంటున్న తడివేలు వచ్చి గొప్ప కమేడియన్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం.
- వర్థెల్లి బాపూరావు, మేజర్‌న్యూస్, సిటీబ్యూరో
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































