Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
"చూపు"న్న రాగం...

సూర్యచంద్రులు ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష దైవాలు. సాధారణంగా వెలుతురుకు అలవాటు పడ్డవారు ఒక్కసారిగా చీకటిలో ఉండాల్సివస్తే... వారికి ప్రత్యక్ష నరకమే. మరి తొలి నుండీ వెలుతురుకు అలవాటై మధ్యలో దానిని పోగొట్టుకన్న వారి మానసిక పరిస్థితిల ఎలా ఉంటుంది? దాని మాట అటుంచితే మనోనిబ్బరం మాత్రం అద్భుతంగా పెరిగి అసామాన్య విజయాలను చాటుతారని చరిత్ర నిరూపిస్తోంది.


Mohan-Krishnaమోహనకృష్ణ... ఆయన రాగం మాదిరే ఆయన కూడా మృదుమధురం. ఆ గళంలో ఏ రాగమైనా ఇట్టే ఒదిగిపోతుంది. ముగ్ధమనోహరంగా పలుకుతుంది. డిగ్రీ చదువుకునే రోజుల్లో క్రమంగా చూపు మందగించి కళ్ళు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నా, కనులు లేవని కలతపడకుండా వారసత్వంగా సంక్రమించిన నాదోపాసనను నలుదిశలా వ్యాప్తిచేస్తూ... అఖండ విజయాలు సొంతం చేసుకుంటున్న 48 సంవంత్సరాల మోహనకృష్ణ జీవన ప్రస్థానంలోని విభిన్న రాగాలు వారి మాటల్లోనే...

నేను సెప్టెంబరు 3, 1962న కృష్ణాజిల్లా మచిలీపట్నం లో పుట్టాను. వారసత్వంగా వచ్చిన సంగీతమే నన్ను ఈ రంగంలో నిలబెట్టింది. ఇంట్లో ఎక్కువగా పద్యాలు పాడుతుండేవారు. మా అమ్మ మ్మ చాలా బాగా పాడేది. 8 ఏళ్ళ వయస్సులో విష్ణు ప్రభాకర కృష్ణమూర్తి శాస్ర్తి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చే ర్పించారు. అవగాహన అంతగారాని వయసు. పద్ధతి తెలిసేదికాదు, ఘంటసాల పాటలంటే విపరీతమైన అభిమానం, పిచ్చి ఏర్పడింది.

ఓసారి మా గురువుగారు బాలమురళీకృష్ణ పాడిన క్యాసె ట్‌ ఇచ్చి వినమన్నారు. దాన్ని విన్నాక చాలా ఆనందం వే సింది. అలా నాధ్యాస కర్ణాటక సంగీతం వైపు మరలింది.ఒకసారి బొటానికల్‌ టూర్‌ సందర్భంగా మా నాన్న మ ద్రాసు తీసుకెళ్ళారు. సినీ గాయని బి. వసంత మానాన్నకు సోదరి వసుస వారింట్లోనే వున్నాం. అప్పుడే నా కీర్తనవిని బొడ్డుపల్లి రవీంధ్రనాధ్‌ మంగళంపల్లి దగ్గర పాడిస్తానని తీసుకెళ్ళారు. ‘మహదేవసుతమహం’ అని ఒక కీర్తన పా డాను. వారు చాలా సంతోషించారు.

అప్పటికి నేను బి.కాం ఫస్టియర్‌ చదువుకుంటున్నా. ఓ రోజు ఊళ్ళో జరిగిన వారి కచేరీని నేను నిద్రపోకుండా వి న్నా. దేవలోకంలో విహరించినట్లయింది. 1980 జూన్‌లో బాలమురళీ కృష్ణగారి దగ్గర సంగీత సాధ న మొదలుపెట్టాను. ఒక వర్ణం, 3 కీర్తనలు చెప్పా రు. మద్రాసలులో ప్రముఖ గాయని విజయలక్ష్మి శర్మగారింట్లో వుండేవాడిని. అదే ఏడాది ఆకాశవా ణి జాతీయ స్థాయిలో నిర్వహించిన సంగీత కచేరి లో తొలి బహుమతి నాకు వచ్చింది. అదే సంవత్స రం విజయవాడ ఆకాశవాడ జరిపిన ఆడ్మిషన్‌లో సెలెక్టయ్యాను. డిగ్రీ చివరి సంవత్సరంలో వుండగా కళ్ళ కలక తీవ్రంగా వచ్చింది. కళ్ళు తెరవలేక పోయేవాణ్ణి. ఆ తరువాత ఆ స మస్య పెరిగిపోయి చూపు పూర్తిగా మందగించింది. ప్రస్తు తం ‘ఎ’ గ్రేడు ఆరిస్టుగా హైదరాబాద్‌ కేంద్రంలో ఉద్యో గం చేస్తున్నాను. లలిత, శాస్ర్తీయ సంగీతాలతో పాటు విభిన్న ప్రాంతాల సంగీత రీతులు వినగలిగే అవకాశం కలుగుతోంది.

Mohan-Krishna-baluమా అమ్మమ్మ పేర ‘రాగవర్ధని’ కల్చరల్‌ అసోసియేషన్‌ స్థాపించి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ వారితో ప్రాగ్రాంలు ఇప్పించి ప్రోత్సహిస్తున్నాను. నా శిష్యుల్లో సాయిచరణ్‌, జ్యోత్స్న, రమ్య (ఐడియా సూపర్‌ సింగర్స్‌) బాగా పాడు తున్నారు. బ్లూ లోటస్‌ ఇన్ఫర్‌ మేటిక్‌ సంస్థ ‘మ్యూజిక్‌ టీచర్‌’ అనే పేరుతో ‘బ్యూటీ ఆఫ్‌ కర్ణాటిక్‌ మ్యూజిక్‌’, ‘రాగనిధి’ అనే ప్రాజెక్టులను నిర్వహించి హైదరాబాద్‌లో నేను వెలుగు లోకి రావడానికి సహకరించారు. గత 5 సంవత్సరాలుగా సినీ నేపధ్య గాయకుడు ఎస్‌.పి. బాలసుబ్రమణ్యంతో కలిసి ‘స్వరరాగ సమ్మోహనం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను.
అలాగే ‘బ్లాక్‌’ అనే ప్రోగ్రాంకు జడ్జిగా వ్యవహరించాను. ఒక ఛానల్‌వారు ‘విజువల్లీ ఛాలెంజ్‌డ్‌’ అనే సీర్షికను పిల్ల లకు, పెద్దలకు రెండు సిరీస్‌లు నిర్వహించి నాలాంటి వా రు నిరాశపడకూడదని నిరూపించారు. ఇది నాజీవితంలో మరువలేను.

ఛానల్స్‌ వచ్చాక కర్ణాటక సంగీతం నేర్చుకునే వారు పెరిగారు. సంగీ తం నేర్చుకునేవారి సర్కిల్‌ ఎంత పెరిగిం దో దానిని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకుంటూ అభివృద్ధి చెందాలి. అందుకు తగిన సూచనలు, గురువు లు, తల్లిదండ్రులు చేయాలి. పోటీలో విజయం సాధించి నా, సాధించకపోయినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేస్తేనే మంచి కళాకారులు కాగలుగుతారు. అన్నారు. మోహనకృష్ణ. విదేశాల్లో ఇప్పటికి అనేక కచేరీలు, వాటితోపాటు వివిధ సంస్థల సత్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం కంచి కామకోటి పీఠానికి ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు.
ప్రపంచంలో కళ్లతో చూడలేకపోయినా పదనిసలతో సుస్వరాల పథంలో పయనిస్తూ పలువురికి మార్గదర్శకులుగా ఉంటున్న మోహనకృష్ణ అంగవైకల్యంతో బాధపడుతున్న ఔత్సాహికులకు మార్గదర్శకుడు.

- కశ్యప

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement468
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us