Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
మహిమాన్వితుడు నెట్టికంటి ఆంజనేయుడు

ఆపద్బాంధవుడు అనాథరక్షకుడుగా వెలసిన కసాపురం ఆంజనేయస్వామి దేవాలయం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధిగా ఆంజనేయస్వామి వేనోళ్ల కొనియాడబడుతూ భక్తుల హృదయాల్లో సుస్థిరమైనస్థానం పొందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి 5 కి.మీ దూరంలోని కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి కష్టాల్లో ఉన్న భక్తులను ఆదుకొనే ఆరాధ్యదైవం.


godఈ దేవాలయానికి దాదాపు 5 శతాబ్దా ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి కాలంలో నిర్మించినట్లు చెబుతున్న ఈ దేవాలయం దినదినా భివృద్ధి చెందుతూ దేశ విదేశాల్లోని భక్తులను ఆకర్షిస్తోంది. క్రీ.శ.15వ శతాబ్దం లో వ్యాసరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.

శ్రీకృష్టదేవ రాయల వారిని ‘కుహూ’ అనే గండం నుంచి రక్షించేందుకు శ్రీవ్యాసరాయలు కొన్ని గంటలపాటు సింహాసనాన్ని అధిష్టించారట. ధర్మప్రచారానికి వ్యాసరాయ లు దక్షిణ దేశయాత్రకు బయలుదేరినప్పుడు... వ్యాసరాయుల ఆరాధ్యదైవం ఆంజనేయ స్వామి కావడంతో వెళ్లిన ప్రతి గ్రామంలోనూ ఆం జనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ ధర్మయాత్ర లో భాగంగా ఇప్పుడు చిప్పగిరి గా పిలిచే అప్పటి శిల్పగిరిలో వ్యాసరాయలు ఆతిధ్యాన్ని పొం దినపుడు ఆంజనేయ స్వామి కలలో కనిపించి నెట్టికల్లు గ్రా మంలో (ప్రస్తుతం కసాపురం) ఎండువేపపుల్ల చిగురించిన ప్రాంతంలో విగ్రహ ప్రతిష్ఠ చేయాల్సిందిగా ఆదేశించారట. నెట్టికల్లు గ్రామంలో ప్రజలు ఆంజనేయ స్వామివారిని భక్తితో ఆరాధించనందుకు గ్రామం జీర్ణావస్థకు చేరగా ప్రజలు అక్కడి నుండి వలస వెళ్లారని చెబుతారు.

templeనెట్టికల్లు గ్రామంలో శ్రీస్వామి వారు ఉద్భవించిన సందర్భంగా శ్రీస్వామి వారికి శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి అని నామకరణం చేశారు. నెట్టికల్లు అంటే మంచిరాయి అని, అలాగే నెట్టికంటి అం టే ఒంటి కన్ను కలవాడని అర్థం. శ్రీ స్వామి వారు విగ్రహంలో కుడి కన్ను తో భక్తాదులను చూస్తూ వారివారి అభీష్టాలను నెరవేరుస్తున్నారు. అప్పటి నుండి శ్రీ స్వామి వారిని కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామిగా భక్తులు కొలుస్తున్నా రు. శ్రీ స్వామివారు వెలిసినప్పటి నుండి ఇప్పటిదాకా శ్రీనెట్టికంటి ఆంజనే యస్వామి వారికి మన బాధలు, ఆపదలు, కోరికల గురించి మనసా, వాచ కర్మ ణా విన్నవించితే శ్రీస్వామివారు భక్తుల బాధలు నివారణ మార్గాలను స్వప్నంలో నే చూపిస్తాడని భక్తుల అపారమైన నమ్మకం.

అంతేగాక గాలిచేష్టలు, గ్రహపీడ లు పట్టినవారు సంతానప్రాప్తికి మండలం (40) రోజులు అక్కడే ఉండి శ్రీస్వా మి వారికి వాయువ్య భాగంలో ఉన్న శ్రీవారి పుష్కరిణిలో ఉదయం, సాయం త్రం స్నానం చేసి శ్రీవారి నామాన్ని జపిస్తూ, నీళ్లు పిండిన తడి గుడ్డతో 108 ప్రదక్షిణలు చేస్తూ ఒంటి భోజనం చేస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, క్షౌరం, మద్యం, దూమపానం, మాంసాహారాన్ని విసర్జిం చి నిష్టగా సేవచేస్తే ఆ భక్తాదులకు పట్టిన గాలిచేష్టలు, గ్రహదోషాలు శ్రీస్వామి వారే స్వయంగా పోగొడతారన్నది భక్తుల నమ్మకం.

godస్వామివారికి ఆలయంలో జరిగే ఉత్సవాలు, వార్షికోత్సవాలు: చైత్ర మాసం తిథి శుద్ధపాడ్యమి నుండి తదియ వరకు ఉగాది ఉత్సవములు రథోత్స వములు, లంకాదాహనము, చైత్రమాసము శుద్ధనవమిన శ్రీసీతారామ చంద్ర స్వామి వార్ల తిరుకళ్యాణ మహోత్సవం, గ్రామోత్సవం జరుగుతుంది. చైత్రశుద్ధ పూర్ణిమనాడు హనుమజ్జయంతి, పంచసూక్తిహోమం, మహాభిషేకం, గురుపౌర్ణ మి ఉత్సవాలు జరుగుతాయి. శ్రీస్వామి ఆలయం భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతుంది. ప్రతి ఏడా ది కార్తీక మాసంలో జరిగే హనుమద్‌వ్రత్‌ వేడుకల సందర్భంగా దేశం నలుమూలలకు చెందిన వేలాది మంది శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి భక్తులు హనుమాన్‌ మాలను ధరిస్తారు.

- యం. రవికుమార్‌, మేజర్‌న్యూస్‌, గుంతకల్లు

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement405
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us