
Home >> Sunday Home >> News
పట్టణానికి ధీటైన పల్లెసీమ
శ్రమను నమ్ముకుంటే సత్ఫలితాలు, అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తుంది ఆ గ్రామం. పచ్చని పంట పొలాలలతో నిత్యం కళకళలాడే ఆ గ్రామంలో రాజధానిలోని భవనాలను తలపించే విధంగా అద్భుత కట్టడాలు కనిపిస్తాయి. ప్రజాప్రతినిధులను ఆశ్రయించక భూమిని నమ్ముకున్న భూమిపుత్రులు ఆ గ్రామానికి ప్రత్యేక శోభను సంతరించారు. ప్రభుత్వ నిధులకు ఆశపడకుండా కేవలం వ్యవసాయాన్నే నమ్ముకున్న ఆ గ్రామస్తుల ఐక్యమత్యం ఆ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దింది. వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే పలు విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చి హరిత విప్లవాన్ని సృష్టించిన ఆ గ్రామం పేరే అంకాపూర్.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో... జాతీయ రహదారి-16పై అంకాపూర్ గ్రామం ఉంది. అభివృద్ధికి మారుపేరుగా ఉన్న ఆ గ్రామం వివరాల్లోకి వెళ్తే...అన్ని కాలాల్లో పంటలు పండిస్తూ ఇతర రాష్ట్రాలకు కూరగాయాలను ఎగుమతి చేయడంలో అంకాపూర్ కు మరే ఏ గ్రామం సాటిరాదు. దాదాపు 8వేల జనాభా కలిగి ఉన్న ఆ గ్రామంలో 2,500 ఎకరాల సాగు విస్తీర్ణం లో ఉంది. అన్ని రకాల పంటల్ని పండించడం ఆ గ్రామ రైతాంగం ప్రత్యే కత. పల్లెటూరు అయినప్పటికీ... ఆ 150 కార్లు ఉన్నాయంటే అంకాపూర్ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చసుకోవచ్చు. ఊరంతా సిసి రోడ్లతో, సెంట్ర ల్ లైటింగ్‌తో పూర్తి స్థాయి మురుగుకాలువ నిర్మాణంతో వంద శాతం సానిటేషన్ వ్యవస్థను కలిగియున్న అంకా పూర్ గ్రామం నేటికీ జిల్లాలో ఆదర్శ గ్రామంగా వెలుగొం దుతుంది.
హరిత విప్లవం...
వ్యవసాయరంగాన్ని నమ్ముకున్న ఆ గ్రామం కూర గాయాల సాగులో దేశవాళీ కీర్తిని గడించింది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కూరగాయాలను పండించి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్టల్రకు ఎగుమతి చేస్తారు. దాదాపు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు ఇక్కడే నుండే కూరగాయాల సరఫరా జరుగుతుంది. పూర్తిగా బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న ఆ గ్రామ రైతాంగం ఏనాడు ప్రభుత్వాన్ని చేయిచాచి సహా యాన్ని అడగలేదు. కేవలం వారి శ్రమను పెట్టుబడులుగా పెట్టి సిరులను పండిస్తూ బంగారుబతుకులను వెల్లదీస్తున్నారు. పసుపు పంటలో వినూత్న వంగడాలను సృష్టించి దేశంలోనే అంకాపూర్ గ్రామం పేరు అగ్రపథాన నిలిచింది. నాణ్యమైన పసుపును పండించడం ఇక్కడి గ్రామ రైతాంగానికి వెన్నతో పెట్టిన విద్య.
అంకాపూర్ పసుపు అంటే చాలు పసుపు మార్కెట్‌లో బంగారంతో సమానంగా చూస్తారు. దీంతో పాటు ఎర్రజొన్న సాగుకు అంకుర్పారణ జరిగింది ఈ గ్రామంలోనే. దాదాపు వెయ్యి ఎకరాల్లో పసుపు, ఎర్రజొన్నను పండించి ఇతర రాష్ట్రా లకు, దేశాలకు ఎగుమతిని చేస్తారు. వ్యవసాయం కోసం కొందరు రైతులు భగీరథ ప్రయత్నం చేసి వెయ్యి ఫీట్ల లోతు వరకు బోర్లు వేయించి చరిత్ర సృష్టించారు. ప్రకృతికి ఎదురొడ్డి నిలబడి వ్యవసాయంలో పోటీ పడ్డారు. చివరకు అంకాపూర్ రైతాంగమే గెలిచింది.
సీడ్ ప్రాసెస్ కంపెనీలకు శ్రీకారం...
మేలుజాతి విత్తనాలను తయారుచేయడం కోసం, నాణ్యమైన పంటను ఉత్పత్తి చేయడం కోసం ఇతర ప్రాం తాలపై ఆధారపడలేదు. వ్యవసాయ శాఖ తమకేదో ఒరగ బెడుతుందని ఆశ పడలేదు. అక్కడి రైతాంగమే చైతన్య వంతంగా సీడ్ ప్రాసెసింగ్‌ను రెండు దశాబ్దాల క్రితమే ఆరంభించారు. మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి శభాష్ అనిపించుకున్నారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలే నివ్వెరపో యేలా పంటలను పండించి విత్తన ఉత్పత్తికి శ్రీకారం చు ట్టారు. సీడ్‌ప్రాసెస్ కంపెనీలను ఒక్కొక్కటిగా నెలకొల్పగా ప్రస్తుతం వాటి సంఖ్య 20కి చేరింది. ఇక్కడి నుండే నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు విత్తనాలను సరఫరా చేస్తున్న అంకాపూర్ రైతాంగం కీర్తి దేశం నలుమూలలా పాకింది.
విదేశాల్లో వీరిదే హవా...
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చిన అంకాపూర్ ప్రజలు తమ పిల్లల్ని విదేశాలకు పంపి చరిత్ర సృష్టించారు. ఒక్క అంకాపూర్ గ్రామం నుం డే దాదాపు 120 మంది అమెరికా, అస్ట్రేలియాలతో పాటు యూరప్ దేశాల్లో చదువుతో పాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రాబోయే రోజుల్లో ఇంటికొక వ్య క్తి విదేశాల్లో చదవడానికి గ్రామస్తులు కృషి సలుపుతున్నారంటే వారి పట్టుదలకు నివ్వెరపోవాల్సిందే. రాజధానిని మరి పించేవిధంగా భవనాల నిర్మాణాలు చేపట్టి జిల్లాలో సంచలనం సృష్టించిన అంకాపూర్ గ్రామస్తులు పట్టుదలకు మారుపేరు. విదేశాలతోపాటు స్వదేశంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఈ గ్రామానికి చెంది న ఎంతోమంది స్థిరపడ్డారు. గ్రామ ప్రజలు వ్యక్తిగతంగా అభివృద్ధి అవుతూనే గ్రామా న్ని సర్వంగాసుందరంగా తీర్చిదిద్దారు.
అందమైన ఆ గ్రామం అందరికీ ఆదర్శం...
అందమైన భవనాలతో అలరారే అంకాపూర్ గ్రామం అభివృద్ధిలో కూడా ఆదర్శంగా నిలిచింది. 1984లోనే గ్రామస్తులంతా కలిసి విరాళాలను సేకరించి, ప్రభుత్వ నిధులు లేకుండా 20 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయాన్ని నిర్మించుకున్నారు. ఈ సచివాలయం రాష్ట్రంలోనే అతిపెద్ద సచివాలయం కావడం విశేషం. గ్రామంలో ప్రతీ వీధిలో సిసి రోడ్లు. ఏ పల్లెటూరిలో లేని విధంగా గ్రామంలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణాన్ని చేపట్టారు. అందమైన నాలుగు పాఠశాల భవనాలు ఆ గ్రామంలో ఉన్నాయి. వంద శాతం సానిటేషన్ పూర్తి చేసుకున్న ఆ గ్రామంలో రైతు భవనం నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.
గ్రామస్తులంతా సాయంత్రానికి అక్కడ చేరుకొని మంచి, చెడ్డల్ని చర్చించుకోవడం ఆనవాయితీ. గ్రామస్తులంతా కుల, మతాలకు దూరంగా, ఐక్యంగా కలిసి ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడటం హర్షించదగ్గ విషయం. ఇదిలాఉంటే ప్రస్తుతం ఆ గ్రామంలో రాష్ర్టంలో ఏ గ్రామంలో లేని విధంగా 150 పైచిలుకు కార్లు ఉండటం మరో విశేషం. చెప్పుకోవడానికి గ్రామమే అయినప్పటికి చూడటానికి పట్టణాన్ని తలపించే అంకాపూర్ గ్రామం వ్యవసాయ రం గంలో మరింత విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టా లని ఆశిదారు
ఐక్యమత్యమే మా గ్రామ విజయ రహస్యం...- సర్పంచ్ పెర్కిట్ రవి
‘‘అంకాపూర్ గ్రామం వ్యవసాయ రంగంలో అద్భుతాలను సృష్టించడంలో దేశంలోనే కీర్తి గడించింది. ఈ గ్రామానికి సర్పంచ్‌ను కావడం నా అదృష్టం. గ్రామస్తులంతా ఐక్యమత్యంగా ఉండి శ్రమించడంతోనే గ్రామం ఈ రోజు రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులను సాధించింది. అందుకు గ్రామాభివృద్ధి కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత అభివృద్ధికి సహకరిస్తున్నాయి. కలిసికట్టుగా కష్టించి పనిచేస్తుండటంతోనే ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాం. ఇదే మా గ్రామ అభివృద్ధి రహస్యం.’’- డి. నర్సింహచారి, ఆర్మూర్ స్టాఫ్ రిపోర్టర్, నిజామాబాద్ జిల్లా
More From Sunday
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































