
వెయ్యి మందికి ఉపాధే లక్ష్యం : విజయ్ వల్లభనేని
వయసులో ఏముంది... మనసులోనే అంతా ఉంది. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగడం కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి కొందరిలో విజయ్ వల్లభనేని కూడా ఒకరు. ఆగస్టు 3వ తేదీ 1967లో వల్లభనేని రామకృష్ణయ్య, స్వరూపరాణి తల్లిదండ్రులకు జన్మించిన విజయ్ పుట్టిందీ, పెరిగిందీ భాగ్యనగరంలోనే. ఆయన స్వస్థలం మాత్రం కృష్ణా జిల్లాలోని గురివాపల్లి. నిజాం కళాశాలలో భౌతికశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన విజయ్ తరువాత అమెరికాలో కంప్యూటర్స్‌లో ఎం.ఎస్ చేశారు. తండ్రి హిందీ అధ్యాపకులు, సాహితీ ప్రియలు. తల్లి కూడా ఉపాధ్యాయిని. దాంతో స్వతహాగా విజయ్ కూడా మంచి ప్రతిభ గల విద్యార్ధిగా పైకి వచ్చారు. 1991లో అమెరికా వెళ్ళి కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన తరువాత విజయ్ కొంతకాలం ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. తన ఉన్నతమైన ఆలోచనలు ఎప్పటికప్పుడు పదును పెడుతూ... ఎంప్లాయిగా గాక, ఎంప్లాయర్‌గా ఎదగాలనే తపనతో 1997 స్వయంగా ‘వెబ్‌యోగా’ పేరిట సొంత కంపెనీని ప్రారంభించారు.
కంప్యూటర్ బూమ్ బాగా ఉన్న సమయమది. సమాచార సాంకేతిక రంగంలో కొత్త ద్వారాలను తెరుస్తూ తక్కువ సమయంలోనే కంపెనీని గుర్తింపు పొందేలా తీర్చిదిద్దారు విజయ్. వివిధ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లలో విజయం సాధించారు. ఇప్పుడు ఆ కంపెనీ ద్వారా 100 మంది ఉపాధి పొం దుతున్నారు. వీరిలో అమెరికన్లే గాక, మనవారు అనేక మంది ఉన్నారు. సత్యం, టిసిఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి కంప్యూటర్ దిగ్గజాల సంస్థలలో అనుభవం సంపాదించిన మన వారిలో కొంతమందిని విజయ్ అమెరికా తీసుకువెళ్ళారు. కేవలం ప్రతిభ ప్రాతిపదికగానే ఆయన నియమకాలు జరిపారు. మనవారు ఎంతోమందికి తన కంపెనీలో ఉద్యోగాలు కల్పించారు. దేశీయంగా సంపద సృష్టికి కారణంగా నిలిచిన అమె రికాను విజయ్ బాగా ఇష్టపడ్డారు. అమెరికా పౌరుడయ్యారు. ఓవర్‌సీస్ సిటిజన్ షిప్ హోదా కూడా ఉంది. అయినా మనసులో ఏదో మూ ల చిన్న అసంతృప్తి. భారత్‌కు వచ్చే యాలి. ఇక్కడ ఏదో ఒకటి చేయాలి.
స్వదేశంలో ముఖ్యంగా స్వరాష్ట్రం అభి వృద్ధికి తనవంతు కృషి చేయాలి. తన మనసులోని అభిప్రాయాలను అమెరి కాలోనే స్థిరపడిన తన సోదరి, కేన్సర్ వైద్య నిపుణురాలు అరుణా వల్లభనేని, మరో సోదరుడు భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్ రఘవీర్, తన కజిన్ అయిన రాజేంద్రప్రసా ద్‌లతో పంచుకున్నారు. ఎలా చేస్తే.. ఏమి చేస్తే బావుంటుందో వారంతా ఒక రోడ్‌మ్యాప్ వేసుకున్నారు. చొర వ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే తత్వం కలిగిన విజయ్ ఆలోచనలకు వారి స్నేహితుడు వరంగల్‌కు చెందిన డాక్టర్ సతీష్ కత్తుల కూడా జత కలిశారు. వారి సమున్నత ఆలోచనలకు, ప్రణాళికలకు ఫలితమే విఏ గ్రూప్ ఆవిర్భావం. గ్రూప్ ఛైర్మన్‌గా విజయ్ వల్ల భనేని సారధ్యం స్వీకరించారు.
ఆతిథ్య పరిశ్రమలోకి...
ఇండియాకు తిరిగొచ్చి స్థిరాస్థి, ఆతిధ్య రంగాలను తన తొలి ఛాయిస్‌గా విజయ్ ఎంచుకుని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో తమకు ఉన్న 800 చదరపు అడు గుల స్థలంలో హోటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హోటల్ పరిశ్రమలో అగ్రస్థాయి లో ఉన్న ఐటిసి గ్రూప్‌తో కలసి టూరిజం శాఖ గుర్తింపు కలిగిన త్రీస్టార్ హోటల్ నిర్మాణాన్ని 30 కోట్ల రూ.ల వ్యయంతో సర్వాంగ సుందరంగా పూర్తి చేశారు. ఐటిసి వెల్‌కమ్ గ్రూప్ లోని ప్రతిష్టాత్మక బ్రాండెడ్ హోటల్ ఛెయిన్ ఫార్చ్యూన్ పార్క్ పేరు కలసి వచ్చేలా నిర్మించిన ‘ఫార్చ్యూన్ పార్క్ వల్లభ’ నేడు రాజధాని నగరానికి మరో అలంకరణగా వెలుగులు చిమ్ముతోంది. ఫస్ట్‌క్లాస్ బిజినెస్ హోటల్‌గా ఖాతాదారుల, హైదరాబాద్ సందర్శకుల అవసరాలను తీర్చడానికి సిద్ధమైంది. ఈ హోటల్ ద్వారా దాదాపు 150 మంది ఉపాధి పొందుతున్నారు. దీంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా విజయ్ తన తొలి ప్రస్థానాన్ని ప్రారంభించినట్లయింది.
వైద్యరంగంలోనూ...
ఆయన ఎంచుకున్న లక్ష్యం కూడా ఎంతో విలక్షణంగా ఉంది. వైద్య, ఆరోగ్య రంగాలకు చెందిన అన్ని విభాగాలు ఉండేలా ఒక సమీకృత మెడికల్ సిటీ నిర్మించాలనేది విజయ్ అలోచన. తన బంధువులు, స్నేహితులలో అనేక మంది డాక్టర్లు ఉన్నారు. వారి సహాయ, సహకారాలతో అన్ని విభాగాలకు చెందిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య, ఫార్మసీ కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ల్యాబొరేటరీలు, బయో టెక్నాలజీ సంస్థలతో పాటు యోగ, సిద్ధ, ఆయుర్వేద, హోమియో, యునాని, మూలికా, ప్రకృతి వైద్య కేంద్రాలు కూడా ఒకే ప్రాంగణంలో కొలువు తీరి ఉండాలనేది విజయ్ అభిలాష.

ఇది 500 కోట్ల రూపాయలు వ్యయం కాగల భారీ ప్రాజెక్ట్. తద్వారా వెయ్యి మందికి ఉపాధి కల్పించాలనే తన ధ్యేయానికి దిశానిర్దేశం ఏర్పరుచుకున్నారు. ఆ లక్ష్యం విజయవంతం కావాని మనం ఆశిద్దాం. విజయ్ భార్య పేరు సరిత. ఆమె కూ డా కంప్యూటర్స్‌లో ఎం.ఎస్ చేశారు. వారి కంటి పాపలు కిన్నెర (11), వెన్నెల (8). వీరిద్దరూ కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్ర్తీయ నృత్యాన్ని సాధన చేస్తున్నారు. కిన్నెర టెన్నిస్ కూడా బాగా ఆడుతుంది. ఏనాటికైనా మేటి క్రీడా కారిణా ఎదగాలని కృషి చేస్తోంది. బిల్‌గేట్స్, మహాకవి శ్రీశ్రీ, రస్సెల్స్ తనను బాగా ప్రభావితం చేశారని, వారిచ్చిన సందేశాలతో... మంచి ఆలోచనలతో... సాటివారికి సాయపడుతూ ముందుకు సాగలనేదే తన అభిప్రాయమని చిరు నవ్వుతో చెబుతారు విజయ్ వల్లభనేని.
వినూత్న తరహాలో ఆలోచిస్తూ...
వెయ్యిమందికి ఉపాధి కల్పించాలనే సదుద్ధేశంతో పథక రచన చేసి, వ్యాపార రంగంలో దినాదినాభివృద్ధి సాధిస్తున్న విజ య్ వల్లభనేని వ్యాపారరంగంలోకి రావాలనుకుంటున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు
- మతుకుమల్లి మనోహర్, సూర్య బిజినెస్ బ్యూరో
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































