Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
వోక్స్‌ వ్యాగన్‌ సరికొత్త కార్లు

new-beed

వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త కార్లు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితమైన వోక్స్‌వ్యాగన్‌ కొత్త కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకేరోజు రెండు మోడల్స్‌ను వోక్స్‌వ్యాగన్‌ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మార్కెటోకి విడుదలచేసింది. ఈ వారం ‘న్యూలుక్‌’లో ఆ కార్ల వివరాలు మీకోసం..



వోక్స్‌వ్యాగన్‌ సంస్థ తయారుచేసే కార్లకు మంచి డిమాండ్‌ ఉండి. కేవలం ఉన్నతవర్గాలకు చెందిన వారు మాత్రమే వినియోగించే ఈ కార్లు కొ నేందుకు చాలామంది పోటీపడుతుం టారు. ఈ తరుణంలో టోరెగ్‌, న్యూ బీ టెల్‌ పేరుతో వోరియన్‌ మోటార్స్‌ ప్రతి నిధులు రాజీవ్‌ సంఘ్వీ, నీరజ్‌ గార్గ్‌లు మార్కెట్లోకి ఈ కార్లను ప్రవేశ పెట్టారు. న్యూ బీటెల్‌ ధరను రూ. 23, 67,566 గా నిర్ణయించగా టోరెగ్‌ కారు ధరను రూ. 59, 71,024 గా నిర్ణయించారు.

carsటోరేజ్‌ వి6 టిడిఐ పేరుతో విడుదలైన ఈ కారులో 3.0ఎల్‌ వి 6 డీజిల్‌ ఇంజన్‌, 6 స్పీడ్‌ ఆటోమేటిక్‌ టిప్‌ ట్రానిక్‌ గేర్‌బాక్స్‌ ప్రత్యేకత. ఇందులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్‌ విత్‌ ఇఎస్‌పి, రక్షణపరంగా జాగ్రత్తలను తీసుకున్నారు. క్రూయిజ్‌కంట్రోల్‌, పార్క్‌ డిస్టెన్స్‌ కంట్రోల్‌ కూడా ఇందులో ఉంది. న్యూబీటిల్‌ 2.0 పేరుతో విడుదలైన కారులో 4 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 6 స్పీడ్‌ ఆటో మేటిక్‌ టిప్‌ట్రానిక్స్‌ గేర్‌ బాక్స్‌ ఉన్నాయి. నాలుగు ఎయిర్‌ బ్యాగ్స్‌తోపాటు ఎబిఎస్‌ విత్‌ ఇఎస్‌పి, రక్షణపరంగా జాగ్రత్తలను తీసుకున్నారు. ఆక్వారిస్‌ బ్లూ, బ్లాక్‌, గ్రే, మెల్లో ఎల్లో రంగుల్లో ఈ కార్లు మార్కెట్లోకి అందుబాటు లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ మో డళ్లపై ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయ ని తెలియజేస్తున్నారు డీలర్లు.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement389
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us