Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ఘుమ.. ఘుమలు

Paneer-Butter-Masalaపనీర్‌ బటర్‌ మసాలా
కావలసినవి...
పనీర్‌ : 200 గ్రా
ఉల్లిపాయ : ఒకటి
టొమాటోలు: నాలుగు
అల్లం : చిన్నముక్క
వెల్లుల్లి : నాలుగు రెబ్బలు
పుదీనా ఆకులు : పది
పచ్చిమిర్చి : నాలుగు
యాలకులు : రెండు
లవంగాలు : మూడు
వెన్న : రెండూ టేబుల స్పూన్లు.

తయారు చేసే విధానం...
పాన్‌లో వెన్న వేసి వేడిచేయాలి. తరు వాత పనీర్‌ముక్కల్ని ఎర్రగా వేయించి తీయాలి. అదే పాన్‌లో యాలకులు, లవంగాలు వేసి ఓ సెకను వేయించా లి. సన్నగా తురిమిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.
ఉల్లిపాయలు బంగారు వర్ణంలోకి మా రిన తరవాత టొమాటో ముక్కలు వేసి 15 నిమిషాలు వేయించాలి. వేగిన తరువాత స్టవ్‌ మీద పెట్టి రుబ్బిన మసా లా వేసి ఉప్పు సరిచూసి పనీర్‌ ముక్క లు వేసి తక్కువ మంటమీద 15 నిమి షాలు ఉడికించి దించాలి. దించేముం దు కొత్తిమీర చల్లితే సరి.

Bhatani-Parathaబఠానీ పరాటా
కావలసినవి...
మైదాపిండి : మూడు కప్పులు
నెయ్యి : రెండు టేబుల్‌ స్ఫూన్లు
ఉడికించిన పచ్చి బఠాణీలు : రెండు కప్పులు
పచ్చిమిర్చి : ఐదు
జీలకర్ర : టీస్పూను
ఉప్పు : తగినంత

తయారుచేసే విధానం...
ముందుగా ఉడికించిన బఠాణీలను మెత్తగా మెదపాలి. ఓ బాణలిలో కొ ద్దిగా నెయ్యి వేసి జీలకర్ర వేసి వే యించాలి. తరువాత తురిమిన పచ్చిమిర్చి, మెదిపిన బఠాణీ ముద్ద వేయాలి. ఉప్పు కూడా వేసి ఓ నిమి షం ఉడికించి చల్లారనివ్వాలి.

మైదాలో ఉప్పు, నెయ్యి వేసి కల పాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలు గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండలో టేబుల్‌ స్పూను చొప్పున చల్లారిన బఠాణీ మిశ్రమాన్ని పెట్టి అంచుల్ని మూసేసి గుండ్రంగా వత్తా లి. తరువాత నాన్‌సి్‌‌ట పాన్‌ మీద వేసి తగినంత నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్నీ చేస్తే బఠాణీ పరాటా రెడీ.

Navaratan-Kormaనవరతన్‌కుర్మా
కావలసినవి...
కూరగాయల ముక్కలు (క్యారెట్‌, బఠా ణీ, బంగాళాదుంప, కాలీఫ్లవర్‌) : రెండు కప్పులు
డ్రైఫ్రూట్స్‌(జీడిపప్పు, బాదం,కిస్‌మిస్‌): నాలుగు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయలు : రెండు
అల్లం వెల్లుల్లి :2 టీస్పూన్లు
పసుపు :అర టీ స్పూను
ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు
కారం : ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాల : ఒకటిన్నర టీస్పూన్లు
పాలు : ఒక కప్పు
మీగడ : రెండు టేబుల్‌ స్పూన్లు
నెయ్యి : మూడు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు : తగినంత.
పనీర్‌ : 100 గ్రా
టొమాటో గుజ్జు: మూడు టేబుల్‌ స్పూన్లు
పైనాపిల్‌ ముక్కలు : ఐదుటేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం...
ఉల్లిపాయల్ని సన్నగా తురమాలి. కూరగాయ ముక్కల్ని కూడా మెత్తగా ఉడికించాలి. ఓ నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకు ని నెయ్యి వేసి చదరపు ముక్కల్లా కోసిన పనీర్‌ను వేసి ఎర్రగా వేయించి పక్కన ఉంచాలి. అందులోనే ఉల్లిముక్కలు, అ ల్లం వెల్లుల్లి వేసి తక్కువ మంటమీద వే యించాలి. తరువాత టొమాటో గుజ్జు, పసుపు, ధనియాలపొడి, కారం, గరం మసాలా పొడి, ఉప్పు వేసి తగినన్ని నీ ళ్ళు పోసి ఉడికించాలి. ఉడికిన తరువాత కూరగాయ ముక్కలు వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు పాలు, మీగడ వేసి మరో నిమిషం ఉడి కించాలి. దించేముందు వేయించిన ప నీర్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌, పైనాపిల్‌ గు జ్జు, కొత్తిమీర వేసి దించాలి.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement411
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us