Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ద్వాదశరాశి ఫలితాలు

మేషము: మేషలగ్నమందు పుట్టినవాడు విశేషమైన అభిమానము కలవాడును, గుణవంతుడు, కోపవం తుడు, మిత్ర విరోధము, ఇతరలకు సఖుడును పరాక్రమ లబ్ధి విశేషమైన కీర్తి కలవాడును, మిక్కిలి రోష ము కలవాడును అగును. ఈ జాతకమునకు శని, బుధ, శుక్రులు పాపులున్నూ... రవి, గురులు శుభులు శని గురు సంబంధము కలిసిన గురుడు శుభు డు కానేరడు. అట్లే శనియు శుభుడు కాడు. శని మా రక గ్రహము.

వృషభము: వృషభ లగ్నమున పుట్టినవా డు గుణవంతుడును, ధనికుడును, గురుభక్తి కలవాడును, సమర ప్రి యుడును, ధైర్యశాలియు, శౌర్యవం తుడును, ప్రియభాషణం కలవాడును, శాంతగుణ ప్రధానుడు అగును.

మిథునము: ఈ మిథున లగ్నమందు పుట్టినవారు భోగశాలురును, ధనవంతులను మరియు రాజశ్రీతము పొందువారును అగుదురు. ఈ జాతకమున కు కుజ, గురువులు, పాపులు, శుక్రుడు శుభుడు, శని, గురులు చేరినచో ఫలితమునివ్వరు.

కర్కాటకము: ఈ కర్కాటక లగ్నమందు పుట్టినవారు మృష్టాన్న భోజనప్రియులు. సజ్జన వాసము చేయువాడును, జలక్రీడాసక్తుడు, సారగ్రహము, ఉదారు డు అగును. ఈ జాతకమునకు శుక్ర, శని, బుధ, కు జ, గురులు పాపులు. కుజుడు రాజయోగకారకుడు. గురు, కుజులు రాజయోగమునిత్తురు. శుక్రుడు మా రకము కల్గించును.

సింహము: ఈ సింహలగ్నమందు పుట్టినవాడు కృశమైన కడుపు కలవాడును. మంచి పరాక్రమశాలి యు, భోగవంతుడును, స్వల్ప సంతానము కలవాడు ను, మిత భోజనుడును, అభిమానవంతుడును అగు ను. ఈ జాతకమునకు శని, బుధ, శుక్రులు పాపు లు. అంగారకుడు రాజయోగమునిచ్చును. గురు, శుక్రులు కూడిన ఫలితమివ్వరు.

కన్య: ఈ కన్యా లగ్నమందు పుట్టినవాడు మన్మథ వి లాసపడును. కామకేళీ తరంగుడును. సుగుణజ్ఞాన సత్వకౌశాల్యాది గుణయుక్తుడును. ప్రసన్నత కల్గినవాడును, ధనశాలియు, క్షరసాగర కన్య యొక్క నిరం తరానుగ్రహము పొందినవాడును (లక్ష్మీ ప్రసన్నుడు) అని మహాదైశ్వర్యమును పొందినవాడును అగు ను. గురు, శని, కుజులు పాపులు. శని, బుధులు శుభులు. శని రాజయోగమునిచ్చును.

తుల: ఈ లగ్నమున పుట్టిన... విశేష గుణములు కలవాడును. ధనోపలబ్ధమగు వ్యాపారమునందు అతి నిపుణత కలవాడును లక్ష్మీ ప్రసన్నుడును స్వ క్కుల శ్రేష్ఠుడు అగును.ఈ జాతకమునకు గురు, రవి, కుజులు పాపులు. శని, బుధులు కూడా రాజయోగమునిత్తురు. గురుడు మారకమునిచ్చును.

వృశ్చికము: ఈ లగ్నమున పుట్టినవాడు పరాక్రమ శాలియు, మంచి ఆలోచనాపరుడును, విచారణ చేసి సారము గ్రహించువాడును. పరిపూర్ణ విద్యా నైపుణ్యము కలవాడును. పాప కార్యాసక్తుడును అగును. ఈ జాతకమునకు బు ధ, శుక్ర, శనిలు పాపులు. గు రుడు శుభుడు. రవి, చంద్రులు శుభయోగమునిచ్చువారు.

ధనస్సు: ఈ ధనుల్నమందు పుట్టినవారు బుద్ధిశాలియు. రా జసేవావిభుడును. సత్య సంక ల్ప సిద్ధుడును. మిక్కిలి మనోహర రూపము కలవాడు. సుగుణశాలియు, శాస్తవ్రేత్తయు, అస్తవ్రిద్యా నిపుణు డు అగును.

మకరము: ఈ మకరలగ్నమందు పుట్టినవాడు కఠినదేహ ము కలవాడును. అతి మూర్ఖుడును. తన మనస్సు నడక కల్గిన బహు సంతతి పొందువాడును. మంచి చతురుడును, అతి లంబత్వము కలవాడు అగును.

కుంభము: ఈ లగ్నములో పుట్టినవారు చం చల మనస్కులునూ, అతికాములును, ప్రకాశవంతమైన దేహము కలవారును, మంచివారితో స్నేహము చేయువారును, నీరస ధాన్యాదులు కలవారును, డాంబికులు ను అగుదురు.

మీనము: ఈ మీన లగ్నమందు పుట్టినవారు సమర్థులును, మితాహారలును, స్వల్పకాముకులు, స్వర్ణరత్నాదులందు అభిలాష కలవారును, మిక్కిలి వంచనాపరులును, అనేక విషయములను గ్రహించు గ్రహ ణ శక్తియుక్తులు కలవారును అగును. ఈ జాతకమునకు రవి, శుక్రులు పాపులు. కుజ చందులు శుభు లు. కుజ గురులు రాజయోగమునిత్తురు.

డా.ఈడుపుగంటి పద్మజారాణి
ఎమ్మెస్సీ (మాథ్స్‌), ఎం.ఇడి, ఎం.ఏ (తెలుగు), ఎం.ఏ (ఆస్ట్రాలజీ - గోల్డ్‌మెడలిస్ట్‌), పీ.జీ. డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌ వాస్తు, ఎం.సి.వై.టి (యోగా), పీ.జీ. డిప్లొమా ఇన్‌ ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌, బీ.ఎల్‌.
జ్యోతిష్య వాస్తు పండితురాలు
శివం రోడ్‌, హైదరాబాద్‌.
ఫోన్‌- 8143383814
www.padmajaastro.com

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement488
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us