Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
మీ వారం 07/02/2010



మేషం : వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. అనవసర ప్రయాణములు మానసిక అశాంతి కలుగుతుంది. కొన్ని వ్యాపార అవకాశములు వచ్చినట్లే వచ్చి వెనకకు వెళతాయి. సేవకుల వలన ఇబ్బందులు వస్తాయి. మీవద్ద నమ్మకంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారుతారు. మీవద్ద నుండి ముఖ్యమైన సమాచారం ఇతరులకు చేరవేస్తారు. ప్రభుత్వ అధికారులనుండి ప్రోత్సాహం లభిస్తుంది.



వృషభం : ఈ వారం స్పెక్యులేషన్‌ యందు నష్టం కలిగే అవకాశం ఉన్నది. చాలాకాలంగా చేద్దాం అనుకున్న పనులు ఈ వారం పూర్తి చేస్తారు. వృత్తియందు అభివృద్ధికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది చెడ్డవ్యక్తులు మీ అభివృద్ధికి ఆటంకములు కలిగిస్తారు. మోసం ద్వారా ధన నష్టం కలుగుతుంది. అధికారంలో ఉన్న స్ర్తీల నుండి సహాయం లభిస్తుంది. అజీర్ణ సంబంధ వ్యాధులు గాని చర్మ వ్యాధులు గాని వస్తాయి.



మిధునం : ఈ రాశి వారికి ఈ వారం నివాస గృహం మారే అవకాశం ఉన్నది. కుటుంబ చికాకులు ఎక్కువగా ఉంటాయి. దగ్గరి బంధువుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. వృత్తియందు అధికారుల నుండి ఒత్తిడి వస్తుంది. విద్యార్థులు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలయందు విజయం సాధిస్తారు. విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి. కొన్ని నిర్ణయాలు తీసుకొని వెంటనే మార్చుకుంటారు. ఏమి చేయాలో తోచని స్థితి కలుగుతుంది.



కర్కాటకం : వృత్తి వ్యాపారములందు మార్పులు వస్థాయి. తలచిన పనులు ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తే తప్ప పూర్తి కావు. దగ్గరి బంధువుల నుండి మీరు ఆశించిన సహాయ సహకారములు లభించవు. భార్యతో విబేధములు వస్తాయి. దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రములను సందర్శిస్తారు. స్ర్తీలకు ఉద్యోగ అవకాశములు వస్తాయి. అధికారంలో ఉన్న స్ర్తీల నుండి సహాయం లభిస్తుంది. విద్యార్థులు విద్యయందు శ్రద్ధ పెట్టలేకపోతారు.



సింహం: బంధువుల నుండి ధన సహాయం లభిస్తుంది. తల్లి తరుపు బంధువులతో విరోధం వస్తుంది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా అగుటవలన కొన్ని ముఖ్య పనులు వాయిదా పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలయందు విజయం సాధిస్తారు. కుటుంబ సమేతంగా దగ్గరిలో ఉన్న పుణ్యక్షేత్రమును సందర్శిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగములు వింటారు. విదేశీ మిత్రుల సహకారం లభిస్తుంది. అధికారుల నుండి వ్యతిరేకత వస్తుంది.



కన్య : ప్రారంభంలో తలచిన పనులు వాయిదా పడతాయి. మాతృవర్గ బంధువుతో విరోధములు అజీర్ణ వాయుసంబంధ రోగములు కలుగును. విద్యార్థులకు విద్యయందు శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలయందు విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారముల యందు శ్రద్ధ తగ్గి ఒక విధమైన నిరాశ ఏర్పడుతుంది. రుణ ప్రయత్నమలు ఫలిస్తాయి. స్ర్తీలకు ఉద్యోగ ప్రయత్నమలు ఫలిస్తాయి. సంతాన లాభం కలుగుతుంది. తండ్రి లేదా కుమారుని యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంది. స్ర్తీల నుండి సహాయం లభిస్తుంది. రుణదాతల నుండి ఒత్తిడి వస్తుంది.



తుల : ఖర్చులు మరీ ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల అభివృద్ధికి వాహనముల కొరకు ధనవ్యయము చేస్తారు. గృహంలోనూ తన వస్తువలు సమకూర్చుకుంటారు. సినిమా, టి.వి. రంగంలో ఉన్నవారికి మంచి అవకాశములు వస్తాయి. గుర్తింపు వస్తుంది. ఇళ్లు విడిచి ఇతర ప్రాంతములయందు నివసించవలసి వస్తుంది. విద్యార్థులు అధికశ్రమపడితే తప్ప అనుకున్న ఫలితమలు సాధించలేరు.



వృశ్ఛికం : ఈ వారం వృత్తియందు అభివృద్ధి వస్తుంది. స్థిరాస్తులపైన ఆదాయం లభిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. వారియొక్క ఆస్తుల విలువ పెరుగుతుంది. వచ్చిన అవకాశములు సద్వినియోగం చేసుకొనుట మంచిది. అక్రమ సంపాదన, అనుకోని ధనలాభం వస్తుంది. చెడువార్తలు వినవలసి వస్తుంది. చెడ్డవ్యక్తులతో పరిచయం కలుగుతుంది. స్ర్తీలకు ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది.



దనుస్సు : వృత్తియందు అనుకోని మార్పులు వస్తాయి. కొన్ని అవకాశమలు దగ్గరగా వచ్చి దూరం అవుతాయి. అధికారుల నుండి వ్యతిరేకత వస్తుంది. కుమారుల అభివృద్ధి మీకు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులు విద్యను అశ్రద్ధ చేసి ఇతర కార్యక్రమముల మీద దృష్టిపెడతారు. స్ర్తీలకు ఉద్యోగ అభివృద్ధి వస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నూతన వస్త్ర వాహన లాభం కలుగుతుంది. వృత్తిరీత్యా ప్రయాణములు చేయవలసి వస్తుంది.



మకరం: ఈ రాశి వారికి ఈ వారం తండ్రి తరుపు నుండి ఆర్థిక లాభం కలుగుతుంది. వృత్తియందు అభివృద్ధి అధికార హోదా లభిస్తుంది. విద్యార్థులకు చదువుయందు శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలయందు విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. స్ర్తీలకు ఉపాధి అవకాశములు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధములు నిశ్చయం అవుతాయి. కుటుంబంతో సహా శుభకార్యములయందు పాల్గొంటారు.



కుంభం: ఈ రాశి వారికి ఈ వారం అభివృద్ధికి అనేక అడ్డంకులు వస్తాయి. వాహన ప్రమాదముల వంటివి జరుగవచ్చును. దగ్గరి బంధువుల వలన ఇబ్బందులు వస్తాయి. చెడ్డవ్యక్తులతో సహవాసము వలన పేరుప్రతిష్టలకు నష్టం కలిగే అవకాశం ఉన్నది. మీరు ఆశించిన ధనము సమయమునకు రాకపోవుట వలన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం కలుగవచ్చు. దైవసంబంధ కార్యక్రమముల యందు పాల్గొంటారు.



మీనం : భార్యతో విబేధములు, వృత్తిరీత్యా చెడ్డవ్యక్తులను ఆశ్రయించుట వంటి ఫలితమలు వస్తాయి. అనవసర ప్రయాణములయందు వస్తువులు, ధనం పోగొట్టుకొనుట వంటివి జరుగుతాయి. మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇంట్లో గొడవల వలన వృత్తియందు శ్రద్ధపెట్టలేకపోతారు.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement475
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us