
Home >> Sunday Home >> News
గర్భాశయ కణితులకు హోమియో చికిత్స
నేడు మహిళల్లో వయసుతో నిమిత్తం లేకుండా గర్భాశయ సమస్యలు పెరుగుతున్నాయి. పొత్తికడుపు నొప్పి, అధిక రక్తస్రావం, రుతుసమయంలో నడుమునొప్పి వంటివి వేధి స్తున్నాయి. ఈ తరుణంలో గర్భాశయంలో ఏర్పడే కణితులు వంటి సమస్యలకు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఎ.ఎం రెడ్డి ఈవారం ‘హెల్త్‌గైడ్’లో ఇలా వివరిస్తున్నారు..
సాధారణంగా పదిహేను నుంచి ఇరవై శాతంమంది మహిళల్లో కణితులు ఉంటాయి. అయితే అవగాహ నాలోపం వల్ల గర్భాశయంలో కణితులు అనగానే ఇక ఆప రేషనే శరణ్యమని అనుకునే వారు చాలామంది ఉంటారు. స్ర్తీ సంబంధిత హార్మోన్ల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషించే గర్భసంచిని కేవలం పిల్లలు మోయడానికే పరిమి తం చేసి, ఆ తరువాత అనవసరమైన అవయవంగా పరిగ ణించి తొలగిస్తే ఎన్నో దుష్ఫలితాలు తలెత్తుతాయి.
గర్భసంచి కండరాలతో నిర్మితమైన అవయవం హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఎక్కువ స్రవిం చడం వల్ల కొన్నిసార్లు ఈ కండరాల నుంచి కణితులు వస్తా యి. సాధారణంగా కణితి గర్భాశయం లోపలి భాగంలో ఉన్నప్పుడు అది చిన్నగా ఉన్నా ఎక్కువ రక్తస్రావం జరుగు తుంది. ఈ రకం ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానలేమి కూడా కలి గే అవకాశం ఉంటుంది. గర్భాశయ ఉపరితలం నుంచి వ చ్చే కణితులతో కడుపునొప్పి, వాటి పరిమాణం ఎక్కువగా ఉన్నపుడు నడుమునొప్పి వస్తుంది. గర్భాశయ గోడలో కణి తులలో ఎక్కువ పరిమాణంలోకి వచ్చేవరకు లక్షణాలు కని పించకపోవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో ఉన్నప్పుడు లైంగిక సంబంధమైన ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. సాధారణంగా ఫైబ్రాయిడ్స్ ఉన్నవారికి ఎక్కువ రో జులు అధిక రక్తస్రావంతో పాటు కడుపునొప్పి, పొత్తికడు పు ఉబ్బినట్టు ఉండడం, నడుమునొప్పి, పదేపదే మూత్రం రావడం లేదా ఆగిపోవడం, ఆస్ర్తీ పురుష కలయికలో ఇబ్బ ందిగా ఉండడం, సంతానలేమి, అబార్షన్ అవ్వడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యులు పరీక్ష చేసి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా ఎమ్‌ఆర్ ఐ ద్వారా కణతి పరిమాణాన్ని నిర్థారి స్తారు. తీవ్రమైన రక్తస్రావం వల్ల రక్త హీనత, ఐరన్‌లోపం, అందువల్ల నీ రసం, ఆయాసం మొదలైన సమస్య లు తలెత్తే ప్రమాదం ఉంది. ఫైబ్రా యిడ్‌కు సంబంధించిన లక్షణాలు కనపడినా, స్కానింగ్ ద్వారా బయట పడినా ఆందోళన చెందకుండా ఎంతవర కు కణతులు తగ్గే అవకాశం ఉందో తెలుసుకునేందు కు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. కణతుల ను తొలగించడమో, లేదా గర్భాశయాన్ని తొలగించడ మో పరిష్కారం కాదని గ్రహించాలి. ఈ కణతులు క్యాన్సర్ సంబంధమైనవి కాదు కాబట్టి ప్రాణహాని ఉండదని గమనించాలి.
హోమియోపతిలో మందులు...
హోమియోపతిలో ఫైబ్రాయిడ్స్‌కి ఉపకరించే మందు లు తూజా, సైలీషియా, మెడోరినమ్, పల్పటిల్లా, కాల్కే రియా కార్బ్, నాట్రమ్ కార్బ్, నైట్రిక్ యాసిడ్, లాకెసిస్, ఫాస్ఫరస్, కాలీకార్బ్ వంటివి. వ్యాధి లక్షణాలతో పాటు రో గి లక్షణాలను, మూలకారణాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే హోమియోపతి మందుల వల్ల ఫైబ్రాయిడ్ సమస్యకు చక్కని ఫలితం కనిపిస్తుంది.
తూజా: పొత్తికడుపులో ఎడమవైపు నొప్పిగా ఉండడం, నెల సరికి ముందు ఎక్కువగా చెమటలు రావడం, నెలసరిలో ఎక్కువగా రక్తం పోవడం, స్థూలకాయం ఉన్నవారికి ఈ మందు పనిచేస్తుంది.
సైలీషియా: నెలసరి మధ్యమధ్యలో రక్తస్రావం కావడం, అధిక రక్తస్రావంతో శరీరం చల్లబడిపోవడం, చలి భరించ లేకపోవడం, గర్భాశయంలో ఉన్న గట్టి కణితులు కలిగి సన్నగా ఉండేవారిలో ఇస్తారు.
మెడోరినమ్: ముదురు రంగులో తీవ్రమైన రక్తస్రావం, పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం, బోర్ల పడుకున్నప్పు డు నొప్పి తగ్గడం వంటి లక్షణాలకు ఇది పనిచేస్తుంది.
నేట్రమ్ కార్బ్: పొత్తికడుపు కిందికి లాగుతున్నట్లుగా ఉండి బరువుగా ఉండడం, మాంసం కడిగిన నీటిలా నెలసరి కావ డం, తెల్లబట్ట అయ్యే ముందు కడుపునొప్పి రావడం, ఎండ ని భరించలేని వారిలో ఈ మందు ఇస్తారు.
ఫాస్ఫరస్: నెలసరి ఎక్కువ రోజులు కావడం, నెలల మధ్య లో రక్తస్రావం, రక్తహీనత, గర్భాశయంలో పెరిగే పాలిప్ ఉండి, సన్నగా ఉండి, చల్లని పదార్ధాలను ఇష్టపడే వారికి ఈ మందు పనిచేస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో ఈ మందులు వాడడంవల్ల ఫైబ్రాయిడ్ లక్షణాలను అరికట్టవచ్చు.
పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్.
సెల్: 9290901010
www.positivehomeopathy.in
More From Sunday
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































