Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
ఛాన్స్‌ పే ఛాన్స్‌

జెనీలియా డిసౌజా దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్‌. ఆమె నటించిన ఎన్నో తమిళ, తెలుగు చిత్రాలు సూపర్‌ హిట్లయ్యాయి. హిందీలో అరంగేట్రం చేస్తూనే ‘జానే తు యా జానే నా’తో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా ‘లైఫ్‌ పార్టర్‌’ కూడా ఆర్థికంగా ఫరవాలేదనిపించడంతో బాలీవుడ్‌లో హాసిని తన స్థానాన్ని పదిల పరుచుకుంది. ఇటీవల విడుదలైన ‘ఛాన్స్‌ పే డ్యా న్స్‌’ కూడా హిట్‌ టాక్‌నందుకోవడంతో జెనీలియా కు ఛాన్స్‌ల మీద ఛాన్స్‌లు వెల్లువెత్తుతున్నాయి.


genniప్రశ్న: ‘ఛాన్స్‌ పే డ్యాన్స్‌’ సినిమాలో సీరియస్‌తోపాటు, కామె డీ సీన్ల లో కూడా నటించినట్టున్నారు?
జెనీలియా: ‘ఛాన్స్‌ పే డ్యాన్స్‌’ చిత్రంలో నేను, షాహిద్‌ పూ ర్‌ హీరో, హీరోయిన్‌లుగా నటించాం. సినిమాలో సీరియస్‌, కామెడీ సీన్‌లు రెండూ ఉన్నాయి. అవి సందర్భానికనుగుణంగా వస్తుంటాయి. హీరో హీరోయిన్ల జీవితాల్లో జరిగే ఘటనల ఆధారంగా కామెడీ, సీరియస్‌ సీన్‌లను చాలా అద్భుతంగా వచ్చాయి.

ప్ర: సినిమా టైటిల్‌ బట్టి చూస్తే, డ్యాన్స్‌ ప్రధానాంశంగా ఉన్న ట్లనిపిస్తుంది. నిజమేనా?
జె: ముమ్మాటికీ కాదు. చిత్రంలో అదృష్టం ప్రధాన పాత్ర పో షిస్తుంది. షాహిద్‌కు అదృష్టం వరిస్తుంది. దానిని గరిష్టంగా వినియోగించుకోవాలనుకుంటాడు. డ్యాన్స్‌ సినిమాలో ఒక భాగం మాత్రమే. మొత్తం మీద ‘ఛాన్స్‌ పే డాన్స్‌’... ‘కెన్‌ సిని మా అని చెప్పవచ్చు.

ప్ర: ‘కెన్‌’ సినిమా అంటే?
జె: ఒక నటుడు సెకండ్‌ రోల్‌ లేదా సపోర్టింగ్‌ రోల్‌ చేసినా, సినిమా చూసిన తర్వాత కూడా ప్రేక్షకుల మనస్సుల్లో గుర్తుండి పోతాడు. ఉదాహరణకు ‘ట్రెజరీవాలా’ సినిమాలో షెనాజ్‌ పా త్ర. ఈ పాత్ర ప్రేక్షకుల మనస్సుల్లో కలకాలం నిలిచి ఉంటుం ది. అటువంటి సినిమాను కెన్‌ సినిమాగా చెప్పవచ్చు.

ప్ర: అయితే, ప్రేక్షకులు కలకాలం గుర్తుంచుకునే పాత్ర ‘ఛా న్స్‌ పే డాన్స్‌’లో ఉందంటారా?
జె: కచ్చితంగా, విజయవంతమైన ప్రతి పురుషుడి వెనుక ఒ క స్ర్తీ ఉంటుందని అంటారు. అటువంటి స్ర్తీ పాత్రను ఈ సిని మాలో పోషించాను. హీరో జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటాడు. గర్ల్‌ఫ్రెండ్‌గా అతనికి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను.

ప్ర: మీరు చిత్రంలో ప్రతి సన్నివేశంలోనూ కారణం లేకుం డా ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నట్లు నటించారని, దీంతో ప్రేక్షకులు ఎంతో ఇరిటేషన్‌కు గురయ్యారని అంటున్నారు?
జె: అంటే దానర్థం నా పాత్రకు తగిన న్యాయం చేసినట్లే క దా! నా పాత్ర ద్వారా ఫర్దీన్‌ పాత్ర పట్లకు ప్రేక్షకులకు సాను భూతి కలగాలి. నా పాత్ర ద్వారా వారిని ఇరిటేషన్‌కు గురి చేస్తే, నా క్యారక్టర్‌కు న్యాయం చేసినట్లవుతుంది.

geniliaప్ర: ‘జానే తు...యా జానే నా’ చిత్రంలో ఇమ్రాన్‌ ఖాన్‌ పా త్రతో సమానంగా మీ పాత్ర ఉంది. అయితే, ఈ చిత్రంలో మీ పాత్ర తక్కువగా ఉందని అంటున్నారు?
జె: ‘జానే తు యా జానే నా’ చిత్రం లోని పాత్ర స్థాయిలో నటించిన ప్రతి చిత్రం లోని పాత్ర ఉండాలంటే ఎలా? నేను నటించిన ‘లైఫ్‌ పార్టనర్‌’లో ఐదుగురు ప్రధాన పాత్రధారు లు. ఇప్పటికీ, ఆ సినిమాలోని సంజనా పాత్ర బాగుందని అందరూ అంటున్నారు. అయినప్పటికీ, ఎప్పటికైనా ఆ పా త్ర స్థాయిని మించిన మరో పాత్రను చేస్తానన్న నమ్మకం నాకుంది.

ప్ర: సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు ముందుగా జి యాఖాన్‌ అనుకున్నారని, తర్వాత ఆమె స్థానంలో మిమ్మల్ని తీసుకున్నారని వస్తున్న విమర్శలపై మీరేమంటారు?
జె: నిర్మాతలు ముందుగా జియాఖాన్‌ను హీరోయిన్‌గా అను కున్న మాట వాస్తవవద అయితే ఆ తరువాత వారు తమ నిర్ణయాన్ని హఠాత్తుగా మార్చుకొని ఆ స్థానంలో నన్ను తీసుకున్నారు. కారణాలేంటో నాకు మాత్రం తెలియదు.

ప్ర: ‘ఛాన్స్‌ పే డ్యాన్స్‌’పై ప్రేక్షకు నుంచి మంచి స్పందన వ చ్చింది. 2010 ప్రారంభం మీకు మంచి హిట్‌ ఇచ్చిందని అనుకోవచ్చా?
జె: నేను విధిని నమ్ముతాను. ప్రేక్షకులు ఎంతోమంది వచ్చి, సినిమా బాగుందని చెబుతున్నారు. వాస్తవానికి, విజయాలు, వైఫల్యాలు ముందుగా రాసి పెట్టి ఉంటాయని నమ్ముతాను. దేవుడు ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తాడు. మనకు విజయాన్ని అందించాలని సంకల్పించినప్పుడు తప్పకుండా విజయం వరిస్తుంది.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement467
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us