Home | Archives | PDf Paper
 SEARCH: 
Home >> Sunday Home >> News
Font Size - +
Email | Print |
|
Bookmark and Share
విస్తరిస్తున్న గన్‌ కల్చర్‌

crimeహంతకులు ఇప్పుడు అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించడంలో పోలీసులను సైతం నివ్వెరపరుస్తున్నారు. బీహార్‌, మధ్యప్రదేశ్‌ తరహాలో ఇతర రాష్ట్రాల నుంచి మారణాయుధాలను సరఫరా చేసుకుని కిరాయి హత్యలు, హత్యోదంతాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు కత్తిలాంటి ఆయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడే ముఠాలు సైతం ఇప్పుడు అత్యంత ఆధునిక రివాల్వర్లను సైతం నిందితులు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్‌ కక్షలు ఎక్కువగా ఉన్న సమయంలో అనంతపురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఫ్యాక్షన్‌ నేతలు తమ అంగరక్షకులకు మామూలు తుపాకులను ఇచ్చేవారు.

పోలీసు శాఖ కంటే ఎక్కువగా నిందితులు, కిరాయి హంతకులు ఎ.కే.47 వంటి అత్యంత ఆధునిక ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. గతంలో తల్వార్లు, కత్తులతో దాడిచేసే నేరగాళ్ళు నేడు ఏకంగా రివాల్వర్‌ల ద్వారా తమ పని పూర్తి చేసుకుంటున్నారు. రాజధాని నగరం కిరాయి హంతక ముఠాలను కూడా పోషించే స్థితిలో ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్న మారణాయుధాలు పోలీసు శాఖను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా చేస్తూ అప్పుడప్పుడూ పోలీసులకు చిక్కుతున్నా మారణాయుధాల సరఫరా మాత్రం ఆగిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల జరగిన ఓ యధార్థ ఘటన...

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర మారణాయుధా ల సరఫరా ముఠాను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలు గు దేశవాళీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఉత్తర ప్రదేశ్‌ నివాసితులు, ప్రస్తుతం మౌలాలి హౌజింగ్‌బోర్డు కాలనీలో నివసించే రామానంద్‌ కుస్బా (20), అదే రాష్ట్రా నికి చెందినవాడైన, మౌలాలి ఇందిరానగర్‌ ప్రాంతంలో నివసించే బెద్రమ్‌ రాథోడ్‌ (19)లు ఈ సంఘటనలో నిం దితులు. ఇద్దరు కూడా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బహదూ ర్‌పురా గ్రామానికి చెందినవారు. అదే ప్రాంతానికి చెందిన రతన్‌సింగ్‌ (25) అనే యువకుడితో వీరికి పరిచయం కలి గింది. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సం పాదించాలని ముగ్గురు కలిసి పథకం వేశారు.

ఉత్తర ప్రదేశ్‌ నుంచి నగరానికి మారణాయుధాలు అక్రమ మా ర్గంలో తీసుకువచ్చి విక్రయించాలని పథకం వేశారు. వాటిని విక్రయించడం ద్వారా పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించాలని కలలు కన్నారు. పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అశోక్‌ అనే వ్యక్తిని హైదరాబాద్‌లో కలిశారు. తమ పథకాన్ని వెల్లడించకుండా ఉపాధి కోసం ఏదైనా ఉద్యోగం చూపించాలని కోరారు. మూడు నెలల క్రితం నగరానికి వచ్చిన నిందితులు గతంలో ఫోన్‌ద్వారా పరిచయం అయిన అశోక్‌ను కలిశారు. దీంతో అశోక్‌ వీరికి ఐస్‌క్రీమ్‌ విక్రయించే బండిని ఉపాధికోసం ఇప్పిం చాడు.

ఐస్‌క్రీమ్‌ బండి నడుపుతున్నట్లు నటిస్తూనే చెర్ల పల్లి, చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే నిందితుల ను పరిచయం చేసుకుని వారికి ఏమైనా మారణాయుధా లు కావాలా అనే కోణంలో ఆరా తీయడం ప్రారంభించా రు. ఐస్‌క్రీమ్‌ విక్రయిస్తూనే నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రతన్‌సింగ్‌ ద్వారా నాలుగు దేశ వాళీ తుపాకులను తెప్పించారు. వాటిని గోనెసంచీలో పెట్టుకుని రైలులో ఉత్తర ప్ర దేశ్‌ నుంచి రాజధానికి తరలించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి మారణాయుధాలను సరఫరా చేసే నేరస్తులపై, అక్రమ మారణా యుధాలు సరఫరా చే సే వారిపై కన్నేసిన పోలీసులు ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులపై కూడా ఆరాతీశారు. రతన్‌సింగ్‌ ద్వారా రైలు లో నాలుగు మారణాయుధాలు సరఫ రా చేసినట్లు గమనించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం గుట్టురట్టయింది. దీంతో పథకం ప్రకా రం వీరిని పట్టుకున్నారు.

ఇందులో టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వి.బి.కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో ఉత్తర మండలం ఇన్‌స్పె క్టర్‌ వి.శ్యాంబాబు, ఎస్‌ఐలు జీ.వీ.ర మణగౌడ్‌, వై.నాగేశ్వర్‌రావు, ఎస్‌.గిరి ప్రసాద్‌, కే.మధుమోహన్‌రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ యే డాది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 44 మారణాయుధాలు, 175 బుల్లె ట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి సంఘటనలతో పోలీసులతోపాటు స్థానికులు కూడా కూడా నివ్వెరపోతున్నారు. మనమధ్యనే తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా ఆయుధాలను సరఫరా చేస్తు న్న ముఠాలు ఇటీవలికాలంలో అనేకం వెలుగు చేస్తున్నాయి. దీంతో ఎవరిని అనుమానించాలో తెలియని ప రిస్థితులు నెలకొన్నాయి.

More From Sunday
SURYA Specials |
Weekly Specials |
Advertisement416
Copyright 2008 © SPR Publications
Home | PDF Paper | Archives | Tariff | Contact Us