
Home >> Sunday Home >> News
ధూమపానం - శరీరంపై ప్రభావం
పొగతాగడం వల్ల కళ్లు, ముక్కు మరియు గొంతు మీద పడే హానికరమైన ప్రభావాలు...
పొగతాడంతో శరీరం మీద పడే ప్రభావాలు కళ్లు, ముక్కు మరియు గొంతు మీద కనిపిస్తాయి. మొదటి దమ్ము పీల్చుకున్న కొద్ది సెకండ్లలోపునే, శోధాన్ని కలిగించే వాయువులు కళ్లు, ముక్కు మరియు గొంతులాంటి సున్నితమైన పొరల మీద పనితనం చూపడం ప్రారంభిస్తాయి. మీరు ఇలాగే పొగతాగడం కొనసాగిస్తుంటే, శోధం కలిగించే ఈ వాయువులు పొగతాగువారికి కఫం ఏర్పడేలా చేస్తాయి. మీ గొం తు పొర లైనింగ్ మందంగా తయారవుతుంది, దీనిమూలంగా గొంతు క్యాన్సర్‌లో మార్పు కనిపిస్తుంది.
పొగతాగడంతో మీ ఊపిరితిత్తుల మీద పడే హానికరమైన ప్రభావాలు...
ఊపిరితిత్తులకు సంబంధించి పొగతాగడంతో అపాయకరమైన ఆరోగ్య ప్రభావాలు ఉంటాయి. నిరంతరం పొగతాగడంతో ఊపిరితిత్తుల సహజసిద్ధమైన శుభ్రపరిచే సామర్థ్యం పూర్తిగా క్షీణిస్తుంది.శోధం కలిగించే వాయువుల మూలంగా మీ ఊపిరితిత్తుల కణాలకు రసాయనిక హాని జరుగుతుంది. దీనిమూలంగా శ్లేష్మము ఉత్పత్తి పెరిగి దగ్గు మరియు కఫం స్వభావం పెరుగుతుంది.పొగతాగడంతో మీ గుండె మీద పడే హానికరమైన ప్రభావాలు...
హృద్రోగవ్యాధులు (సివిడి) అభివృద్ధి సాధించిన దేశాలలో మృత్యువుకు కారణమయ్యే కారణాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. పొగతాగడం అనేది సివిడి పెంపొందే అపాయకరమైన కారణాలతో కీలకమైన ఒక కారణంగా పరిగణించబడుతుంది మరియు ఇది గుండె పోటుకు మూల కారణం.
మీ ఊపిరితిత్తులకు పొగ చేరుకోగానే, గుండె ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఇది నిమిషానికి 10 నుంచి 25 నిమిషాలు అదనంగా కొట్టుకోవలసి ఉంటుంది లేదా ప్రతి రోజు 36,000 వేల సార్లు అదనంగా, నికోటిన్ మరియు పొగాకు పొగలోని ఇతర శోధం కలిగించే ప్రభావాల మూ లంగా ఎన్నోసార్లు మీ గుండెదడ క్రమరహితంగా కొనసాగుతుంది.
పొగతాగడంతో మీ రక్తనాళాల మీద పడే హానికరమైన ప్రభావాలు...
పొగతాడంతో మీ రక్తపోటు మీద కూడా ఆరోగ్య ప్రభావా లు కనిపిస్తాయి. మీరు కాల్చే ప్రతిసారి మీ రక్తపోటు 10 నుంచి 15 శాతం పెరుగుతుంది. ఈ విధంగా మీ గుండె మరియు రక్తనాళాల మీద అదనపు ఒత్తిడి ఏర్పడి మీకు గుండెపోటు మరియు స్ట్రోక్ అపాయం పెరుగుతుంది.
పెద్దనాళం పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధి సంభవించేందుకు పొగతాగడం అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి. ఇది పొగతాగడానికి కారణమయ్యే అర్థెరొసెలెరొసిస్ మరియు వాసోకన్‌స్ట్రిక్చర్‌కి దారితీస్తుంది. పొగతాగనివారితో పోల్చితే ప్రతి రోజు 15 సిగరెట్లు కాల్చేవారిలో రక్తనాళాల వ్యాప్తి నివారణ తరువాత అవయ అంగచ్ఛేదం రేటు రెట్టింపుకంటే ఎక్కువుంటుంది.
పొగతాగడంతో మీ రక్తం మీద పడే హానికరమైన ప్రభావాలు...పొగతాగడంతో ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కీలకమైన అంశం కార్బన్ మోనాకై్సడ్. పరిశ్రమల మిషిన్లలో సురక్షి తం అని పరిగణించేదానికంటే 600 రెట్లు ఎక్కువగా గాఢ త్వం సిగరెట్ పొగలో ఉంటుంది. పొగతాగనివారితో పోల్చి తే మామూలుగా పొగతాగేవారి రక్తంలో నాలుగు నుంచి 15 రెట్లు ఎక్కువ కార్బన్ మోనాకై్సడ్ ఉంటుంది. ఆ కార్బన్ మోనాకై్సడ్ మీరు పొగతాగడం నిలిపివేసిన కొన్ని గంటలలోపున అకస్మాత్తు మృత్యువు సంభవించడం 50 శాతం తగ్గుతుంది. సిగరెట్ కాల్చి పొగ పీల్చుకోగానే కార్బన్ మోనాకై్సడ్ వెంటనే రక్తంలోకి చేరుకుంటుంది, ఆక్సిజన్ గ్రహీతల చోటుకు అవరోధం కలిగించి మీ ఎర్రరక్తకణాల నుంచి ఆక్సిజన్ కణాలను తొలగిస్తుంది.
పొగతాడంతో మీ చర్మ మీద పడే హావనికరమైన ప్రభావాలు...
పొగతాగడంతో మీ చర్మం మీద కూడా ఎన్నెన్నో ఆరోగ్య ప్రభావాలు కనిపిస్తాయి. పొగతాగడంతో మీ చర్మంలోని రక్తనాళాలు బిగుసుకుపోతాయి. ఆ విధంగా శరీరంలోని అతిపెద్ద అవయవానికి ప్రాణాన్ని సమకూర్చే ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీనికి తోడుగా, పొగతాగేవారిలో హాని కలిగించే సూర్యకిరణాలు వయసుకు ముందే ముడతలు పడేలా చేస్తాయి.
సిగరెట్ తాగడం మరియు క్యాన్సర్ (న్యూకొంబ్)...
సిగరెట్ తాగడానికి మరియు పలుచోట్లలో సంభవించే క్యాన్సర్‌కి మధ్యలో విడదీయరాని సంబంధమున్నట్లు రుజువులు ఉన్నాయి. సిగరెట్ తాగడంలో కనీసం 43 కార్సినోజెన్స్ ఉన్నాయని వివరించడం జరిగింది.
కార్సినోజెన్స్: ఇనిషియేషన్ మరియు ప్రమోషన్ అన్ని బహుళదశ ప్రక్రియలలో వ్యవహరించే పదార్థాలు సిగరెట్ పొగలో ఉన్నాయి. పొగతో నేరుగా సంప్రదింపులకు వచ్చే అవయవాలకు (ఊపిరితిత్తులు, నోరు, అన్ననాళిక) క్యాన్సర్ పెంపొందించే అపాయం ఎక్కువగా ఉంటుం ది. సిగరెట్ పొగలో విడుదలయ్యే పదార్థాలు మానవ శరీ రం ద్వారా పీల్చుకొని వ్యాప్తిచెందడం జరుగుతుంది కాబ ట్టి, దూరమైన చోటులకు కూడా క్యాన్సర్ చేరుకుంటుంది.
సిగరెట్ తాగడం మరియు పెప్టిక్ అల్సర్ వ్యాధి...
పొగతాగడం పెప్టిక్ అల్సర్ పెంపొందడం, ఆలస్యంగా న యం అవ్వ డం మరి యు తిరిగి సంభవిం చడం, ఇంకా చికిత్స ని రోధకత వంటి వాటికి దారి తీస్తుంది.

డా సుధీర్ ప్రసాద్
పల్మోనాలజిస్ట్,అవేర్ గ్లోబల్ హాస్పిటల్స్
More From Sunday
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































