
స్ర్తీలలో నపుంసకత్వం
నపుంసకత్వం అనేది మగవాళ్ళకే కాదు స్ర్తీలలో కూడా ఉంటుంది. దీనినే ‘ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్’ అని కూడా అంటారు. సెక్స్ కోరికలు ఎక్కువగా లేకపోవడం. శృం గారం పట్ల మక్కువలేకపోవడం, భావప్రాప్తి చెందకపోవడం, సెక్స్‌లో పాల్గొంటున్నప్పుడు నొప్పితో బాధపడడంలాంటివి ఈ కోవకే చెందుతాయి. ఈ సమస్యలు శారీరక సమస్యల వలన ఉత్పన్నం కావచ్చు లేదా మానసిక సమస్యలవలన కూడా ఉత్ప న్నం కావచ్చు.
శారీరక సమస్యల విషయానికి వస్తే...
మధుమే హం, గుండె సంబంధిత జబ్బులు, నరాల బలహీనత, హార్మోన్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల మందు లు వాడడం మూలంగా కూడా స్ర్తీలలో సెక్స్ పట్ల విముఖత కలుగవచ్చు. డి ప్రెషన్, వివాహ సంబంధాలలో ఇబ్బందులు వంటి మానసిక సమస్యలతో కూడా స్ర్తీలకు సెక్స్ అంటే ఇష్టం తగ్గిపోతుంది. ఇది రానురాను నపుంసకత్వానికి దారితీయవచ్చు. అయితే అప్పుడప్పుడు వచ్చే సాధారణ సెక్స్ ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవద్దు. కానీ తరుచూ ఇలాంటి సమస్యలకు లోనవుతుంటే మా త్రం ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇలాం టి సమస్యలు కొన్ని నెలలపాటు నిలకడగా వస్తూ ఉంటే మాత్రం సమస్యను బట్టి, సెక్సాలజిస్టును గానీ, మానసిక వైద్యనిపుణున్ని గానీ కలిసి సమస్యకు పరిష్కారం తీసుకోవాలి.
అసలు ‘ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్’ అంటే ఏమిటి’...
మెడికల్ పదజాలం ప్రకారం ‘డిస్ఫంక్షన్’ అంటే సరిగ్గా పనిచేయకపోవడం అని అర్థం. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు భావప్రాప్తి పొందకపోవడం, మానసిక, శారీరక సమస్యలతో సతమతమవుతూ శృం గారాన్ని ఎంజాయ్ చేయకపోవడాన్నే ‘సెక్సువల్ డిస్ఫంక్షన్’ అంటారు. మగవారిలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. దానిని ‘ఎరక్టైల్ డిస్ఫంక్షన్’ అంటారు. స్ర్తీలలో వచ్చే ఈ సమస్యను ‘ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్’ అంటారు. స్థూలంగా చెప్పాలంటే స్ర్తీల లో వచ్చే నపుంసకత్వం.
ఇటీవల మగవారిలో వచ్చే ‘ఎరక్టైల్ డిస్ఫంక్షన్’ పైన సర్వే చేసిన ‘అమెరికన్ ఫౌండేషన్ ఫర్ యూరోలాజిక్ డిసీజ్’ సంస్థ ‘ఫిమేల్ సెక్సువల్ డిస్ఫ ంక్షన్‌పైన కూడా సర్వే జరిపింది. ఇందులో అనేక విషయాలు తేటతెల్లమయ్యాయి. నిజానికి మగవారికి, ఆడవారికి శృంగారం పట్ల ఆసక్తిలో చాలా తేడాలు ఉంటాయి. స్ర్తీలలో సాధారణంగా మొహమాటం ఎక్కువగా ఉంటుంది. భావప్రాప్తి విషయంలో మాత్రం ఇద్దరి ప్రతిస్పందన ఒకేలాగ ఉంటుంది. అయితే మగవారిలో మానసిక స్థితి ఎలాగైతే సెక్స్‌ను ప్రభావితం చేస్తుందో. అలాగే స్ర్తీలలో కూడా అలాంటి సమస్యలే ఉత్పన్నం అవుతున్నాయన్నది ఆ సర్వే సారాంశం. అమెరికన్ ఫౌండేషన్ సంవత్సరం పాటు జరిపిన ఈ అంతర్జాతీయ సర్వేలో అనేక విషయాలు బహిర్గతం అయ్యాయి.
దీనిపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్యానెల్ ‘ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్’పై ఎన్నో డయాగ్నస్టిక్, ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించిం ది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్, అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ (ఐ.సి.డి- 10 ) కు చెందిన స్టాటిస్టికల్ మాన్యువల్ ఆ ఫ్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్(డి.ఎస్.ఎమ్-4) మార్గదర్శకాల ను అనుసరించి ఈ సర్వేను చేపట్టడం విశేషం. ఇందు లో ఐ.సి.డి-10 శారీరక సమస్యలకు సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకుంటే, డి.ఎస్.ఎమ్-4 శృంగారంపై ప్రభావం చూ పే మానసిక సమస్యలపై పరిశోధన జరిపింది.
ఎఫ్.ఎస్.డి పై సర్వే...
2000వ సంవత్సరంలో ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్ ప్యానల్ విడుదల చేసిన రిపోర్ట్ (ఈ రిపోర్ట్ అదే సంవత్సరం మార్చి నెలలో జర్నల్ ఆఫ్ యూరాలజి ప్రచురించింది) ప్రకారం మహిళల్లో సెక్స్ పట్ల విముఖత కలుగడానికి శారీరక సమస్యలు ఎలాంటి ప్రభావం చూపుతాయో, అంతే మొత్తంలో మానసిక సమస్యలు కూడా అంతే ప్రభావం చూపుతాయన్నది ఆ రిపోర్ట్ సారాంశం. ఇందులో ముఖ్యంగా మానసిక ఆందోళన వల న మహిళల్లో సెక్సు సామర్థ్యం తగ్గుతున్నట్టుగా తెలిపింది. ఈ నివేదికలో ఫిమేల్ సెక్సువల్ డిస్ఫంక్షన్‌కు దారితీసే పరిస్థితులను నిర్వచించింది (వివరాలు టేబుల్‌లో ఉన్నాయి).
శృంగారం విషయంలో మహిళలు, పురుషుల్లో అనేక తేడాలు...
అక్టోబర్ 2002 లో ప్రముఖ సెక్సువల్ మ్యాగజైన్ ‘ఆర్కీ వ్స్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్’లో అంతర్జాతీయ ప్రము ఖ సెక్సాలజిస్ట్ అయిన డా జాన్ బాన్‌క్రాఫ్ట్ (కిన్సే ఇనిస్టిట్యూట్ డైరెక్టర్) ఈ విషయంపై అనేక కారణాలను వెల్లడించారు. ముఖ్యంగా సెక్సు కోరికలను ఉత్తేజపరచడం లో టెస్టోస్టిరాన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే టెస్టోస్టిరాన్ విడుదల పురుషుల్లో, స్ర్తీలలో తేడాగా ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్లలో టెస్టోస్టిరా న్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. సెక్సు పట్ల మహిళల ప్రవర్తనపై ఒక్కోసా రి ఆచారవ్యవహారాలు కూడా ప్రభావం చూపవచ్చు. ప్రపంచలో ని వివిధ సంస్కృతుల్లో స్ర్తీల శృంగారం పై ఎన్నో ఆంక్షలు ఉంటాయి. ఇవి వారిలోని సెక్స్ కోరికలపై కూడా ప్రభావం చూపుతాయి. నపుంసకత్వం అనేది మగవాళ్ళకే కా దు స్ర్తీలకు కూడా వస్తుం ది. మానసికంగా దృ ఢంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు దరిచేరవు.
డిజార్డర్ వివరణ
హైపోయాక్టివ్ డిజైర్ డిజార్డర్ శృంగారం పట్ల శ్రద్ధ లేకపోవడం
సెక్సువల్ అవెర్షన్ డిజార్డర్ భాగస్వామితో సెక్సులో పాల్గొనడానికి నిరంతరంగా విముఖత చూపడం
సెక్సువల్ అరౌజల్ డిజార్డర్ సెక్సును పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయకపోవడం
డిస్పరేనియా శృంగారంలో పాల్గొంటున్న సందర్భంలో నొప్పితో బాధపడటం
వజినిస్మస్ అంగప్రవేశం జరిగే సమయంలో యోని కండరాల్లో అసంకల్పితంగా విపరీతమైన నొప్పి కలగడం
నానోకొయిటల్ సెక్సువల్‌పెయిన్ సెక్సుకు మందు జరిపే ఫోర్‌ప్లే సమయంలో జననావ యవాల్లో నొప్పికలగడం

డా ఉపేంద్ర కుమార్
ఎం.ఎస్ (పి.జి.ఐ)
ఎంసిహెచ్(యూరో)
ఇమేజ్ హాస్పిటల్
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































