
పెళ్లి"కళా"నిలయాలు
పెళ్లంటే నూరేళ్ల పంట, ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదిరిందంటే కనీసం రెండు నెలల ముందునుండే హడావిడి మొదలయ్యేది. బంధువుల రాకతో పెళ్లింట్లో సందడి నెలకొనేది. ఇంటికి వచ్చిన బంధువలందరూ ఏదో ఒక పెళ్లి పనిని చేతుల్లోకి తీసుకొని ఆడుతూపాడుతూ పూర్తిచేసేవారు. అమ్మమ్మలు, తాతయ్యలు, అత్తామామలు, పిన్నీ బాబాయిలు ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేవారు. బట్టలు, నగలు, పలహారాలు... ఇలా అన్నిం టినీ సమకూర్చుకోవాలంటే ఒక్కరోజుతో అయ్యే పనికాదు. వధూవరులను ఒక్కటి చేయడానికి ఇంటిల్లిపాది కష్టపడేవారు. అయితే మారుతున్న కాలంలో పెళ్లిల్లో బొత్తిగా సందడే కరువవుతోంది.
ఈ- మెయిల్ పెళ్లిపిలుపుతో వచ్చి నాలుగు అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించి అంతేవేగం గా వెనుదిరుగుతున్నారు ఈనాటి పెళ్లి బంధువులు. ఎందుకంటే ముందేవచ్చి చేయాల్సిన పనులేవీ పెళ్ళిళ్లలో నేడు కనబడడంలేదు. అవన్నీ వెడ్డిం గ్ మాల్స్ చూసుకుంటున్నాయి కదా..! ఇళ్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా... భారతీయ సంస్కృతి సాంప్రదాయల్లో ఇవి అతి పెద్ద విశేషాలు. అయితే మారుతన్న కాలంతో పాటు పెళ్లిళ్లలో కూడా వేగం పెరిగింది. ఆన్‌లైన్ ఆర్డర్లతో, ఫోన్ కాల్స్‌తో అన్నీ సమకూరే రోజులి వి. పెళ్లికి కావలసిన నగలు, బట్టలు, ఫుట్‌వేర్ ఏది కా వాలన్నా... సంపన్నులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు ఇప్పుడంతా... ‘ఛలో వెడ్డింగ్ మాల్’ అంటున్నారు. ఎందుకంటే వధూవరులు తప్ప అక్కడ దొరకనివంటూ ఏమీ ఉండవు కదా..! అయితే ఆర్థిమాం ద్యం, సాఫ్ట్‌వేర్ బూమ్ పడిపోవడంతో వెడ్డింగ్ మాల్స్ కుదేలవుతున్నాయి. దానిపై అపసోపాలు పడుతున్న మాల్స్ యాజమాన్యాలు కొత్త పంథాలను ఎంచుకుంటున్నాయి.
పెళ్లి సంబం ధం కుదిరిందంటే చాలు ఒక్కసారి వెడ్డింగ్ మాల్‌ను సందర్శిస్తే... సగం పెళె్ళై పోయినట్లేనని భావించే రోజులొచ్చేశాయి. దేశంలోని అన్ని నగరాలతో పాటు మన భాగ్యనగరంలో కూడా వెడ్డింగ్ మాల్స్ సంస్కృతి ‘ఆరు నగలు - మూడు చీరలు’గా వర్థిల్లుతోంది. అయితే ఇటీవల వచ్చిన ఆర్థికమాంద్యం, ప్రాం తీయ గొడవల ప్రభావం ఈ మాల్స్‌పై విపరీతంగా పడుతోంది. దీని నుండి బయటపడడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్న ‘వెడ్డింగ్ మాల్స్’ రానున్న పెళ్ళిళ్ళ సీజన్ కోసం వినూత్న ప్రయత్నాలకు తెరతీస్తున్నాయి. ఇప్పటికే వాడుకలో ఉన్న ఇన్‌బ్రాండ్ ఫిల్మింగ్ లాంటి కాన్సెప్ట్‌లకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నాయి. అంతేకాకుండా రాబోతున్న మాఘమాసం సీజన్‌కోసం ఇప్పటికే కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి.
అన్నీ ఒకే చోట...
ఒకప్పుడు పెళ్లికి అవసరమైన వస్త్రాలు, ఆభరణాలు తదితరాలను కొనుగోలుచేయాలంటే మార్కెట్‌లోని వివిధ షోరూంలను సందర్శించాల్సి వచ్చే ది. కాగా నేడు మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ప్రజలకు వెసులుబాటు గా ఉండేవిధంగా వెడ్డింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చాయి. వివాహాది శుభకార్యాలకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు, ఆభరణాలు తదితరాలన్నీ వీటి లో నేడు లభ్యమవుతున్నాయి. ఒకసారి వెడ్డింగ్ మాల్‌ను సందర్శిస్తే పెళ్లికి అవసరమైన అన్నీ ఒకే చోట దొరుకుతున్నాయి. వధూవరులకు అవసరమైన వస్త్రాలు, ఆభరణాలు, ఫుట్‌వేర్, మేకప్ సామాగ్రి తదితరాలు లభించే వెడ్డిం గ్‌మాల్స్‌కు ప్రారంభంలో విపరీతమైన గిరాకీ ఉండేది. దాదాపు పది సంవత్సరాల క్రితం నగరం లో వెడ్డింగ్ మాల్స్‌ను ఏర్పాటుచేయడం ప్రారంభమైం ది. దక్షిణభారతదేశంలో మొదటి వెడ్డింగ్ మాల్ అయిన కళానికేతన్ మొదలుకొని చందనాబ్రద ర్స్, ఆర్.ఎస్.బ్రదర్స్, జె.సి.బ్రద ర్స్, చెనై్న షాపింగ్‌మాల్స్, సిఎం ఆర్ తదితర వెడ్డింగ్ మాల్స్ నేడు నగర ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.
వెడ్డింగ్ మాల్స్‌లో నేడు మహిళలు, పురుషులు, పిల్లలకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు లభ్యమవుతున్నాయి. వీటిలో మగువలను మైమరపించే కంచి, బనారస్, ధర్మవరం తదిర పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు లభిస్తున్నాయి. యువతులకు ప్రత్యేకంగా డిజైనర్‌వేర్, వెస్ట్రన్‌వేర్, ఎథ్నిక్‌వేర్ కలెక్షన్ వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిలో యువతులు మెచ్చే గాగ్రాలు, సల్వార్‌కమీజ్ లు ఉంటున్నాయి. ఇక మగవారికి షెర్వానీ, జోధ్‌పూర్ వంటి వధువు వస్త్రాలు మొదలుకొని వివిధ రకాల మెన్స్‌వేర్ పిల్లలకు కిడ్స్‌వేర్ తదితరాలన్నీ ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇక జ్యూయలరీలో వధువుకు అవసరమైన బంగారు నెక్లెస్‌లు, వడ్డాణం, గాజులు, వంకీలు, చేతి రింగులు, వరుని కోసం బంగారు చైన్లు, బ్రాసె ట్లు, చేతి రింగులు తదితరాలన్నీ ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇవేగాకుండా ఫుట్‌వేర్, మగువలకు మేకప్ సామాగ్రి తదితరాలన్నీ వెడ్డింగ్‌మాల్స్‌లో దొరుకుతున్నాయి. ఇక కొన్ని మాల్స్‌లో వెడ్డింగ్ కార్డులు సైతం లభ్యమవుతున్నాయి.
వెలవెలబోతున్న మాల్స్...
ఆర్థికమాంద్యం, సాఫ్ట్‌వేర్ పతనం, ప్రత్యేక తెలంగాణ ఆందోళనలు వ్యాపార, వాణిజ్య రంగాలపై తీరని ప్రభావం చూపుతున్నాయి. గత సంవత్సర కాలంగా కొ నసాగుతున్న ఆర్థికమాంద్యంతో మార్కెట్లో క్రయవిక్రయాలు బాగా తగ్గి వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఆందోళనల తో కొనసాగుతున్న బంద్‌లు మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టు వ్యాపారా లు మరింత తగ్గాయి. ఈ నేపథ్యంలో నగరంలో వెడ్డింగ్ మాల్స్ కొనుగోలుదారు లు లేక వెలవెలబోతున్నాయి. రానున్న పెళ్లిళ్ల సీజన్‌లోనైనా వాణిజ్యకార్య కలాపాలు పుంజుకుంటాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఆకట్టుకునే ఆఫర్లు...
తగ్గిన వ్యాపారాలను పెంచుకునేందుకు వెడ్డింగ్ మాల్స్ నిర్వాహకులు గత కొన్ని నెలలుగా వివిధ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్ల లో భాగంగా 20 నుంచి 50శాతం వరకు వస్త్రాలు, జ్యూయలరీపై డి స్కౌంట్లను అందజేస్తున్నారు. ఇక వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ టూ సేల్ ఆఫర్‌లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇవేగాకుండా జ్యూయలరీ అమ్మకాలపై తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నారు. ఎం డ్ ఆఫ్ సీజన్ పేరిట ప్రకటిస్తున్న పలు ఆఫర్‌లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.
ఆశలు రేకెత్తిస్తున్న పెళ్లిళ్ల సీజన్...
గత కొన్ని నెలలుగా నిరాశాజనకంగా ఉన్న వ్యాపారాలు పెళ్లిళ్ల సీజన్‌లోనైనా పుంజుకుంటాయని వెడ్డింగ్‌మాల్స్ షోరూం నిర్వాహకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వచ్చేనెల 23వ తేదీన ప్రారంభయ్యే పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నెల నుంచి మాల్స్‌లో కొనుగోలుదారుల సందడి పెరగాలని వ్యాపారులు కోరుకుంటున్నారు. రాబోయే సీజన్‌ను పురస్కరించుకొని వివిధ వెడ్డింగ్‌మాల్స్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నాయి.
సెలబ్రిటీస్ ఈవెంట్స్...
కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు పలువురు వెడ్డింగ్ మాల్స్ నిర్వాహకులు సెలబ్రిటీస్‌తో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సినీతారలను మాల్స్‌కు తీసుకువస్తున్నారు. మోడల్స్‌తో ఫ్యాషన్‌షో నిర్వహిస్తూ వినియోగదారులను ఆకట్టుకున్నారు. సినీ నటులు జగపతిబాబు, ప్రియమణి, సిద్దార్థ్, వరుణ్‌సందేశ్, నానీ, క్రితి, సు మంత్ తదితరులు ఇటీవల షాపింగ్ మాల్స్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరు మోడల్స్‌కు విచ్చేసి సినీ అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా వెడ్డింగ్ మాల్స్ ప్రచారంతో పాటు తాము నటిస్తు న్న సినిమాల గురించి కూడా సినీనటులు వెల్ల డిస్తూ వాటి ప్రచారాన్ని కూడా చేపడు తున్నారు.
ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్...
సినీతారలను వెడ్డింగ్ మాల్స్‌కు ఆహ్వానిం చడమేకాకుం డా సినిమాలతో ‘ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్’ టైఅప్‌ను సైతం మాల్స్ నిర్వాహకులు ఏర్పరచుకుంటున్నారు. ఉభయతారకంగా ఉండేవిధంగా ఈ టైఅప్‌లు జరుగుతున్నాయి. వెడ్డింగ్‌మాల్స్ ప్రచారం కోసం ఈ టైఅప్‌లు జరుగుతున్నాయి. ఈ మేరకు సినిమాల షూటింగ్‌లు మాల్స్‌లో నిర్వహిస్తున్నారు. సినిమాలు విడుదలైన తర్వాత ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న సినిమా హోర్డింగ్‌లపై వెడ్డింగ్‌మాల్స్ అడ్వర్టైజ్‌మెం ట్‌లను కూడా ఏర్పాటుచేసుకుంటున్నారు.
వెడ్డింగ్ మాల్స్ సంస్కృతి రాకముందు పెళ్లికి కావలసిన సామాగ్రికోసం పట్టణాన్ని వడబోయాల్సి వచ్చేది. బట్టలకోసం టైక్స్‌టైల్ షాపులకు, నగలకోసం జువెల్లరీ షాపులకు... అలాగే ఫుట్‌వేర్ ఇలా ప్రతి ఒక్కదానికోసం ఒక్కో షాపు కు వెళ్ళవలసి వచ్చేది.
అయితే వెడ్డింగ్ మాల్స్ సంస్కృతి వాడుకలోకి వచ్చిన తరువాత అన్నీ ఒకే చోట దొరుకుతుండడంతో సంపన్నులతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా వెడ్డింగ్స్ మాల్స్‌నే ఆశ్రయిస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిన ఐదారు రోజుల ముందు ఒక్కసా రి వెడ్డింగ్ మాల్స్‌ను సందర్శిస్తే... అన్నీ సమకూరుతాయి. వెడ్డిం గ్ మాల్స్ ఒకటివెనకు మరొకటి ఇలా పెరుగుతుండడానికి నగర జీవన విధానం కూడా పరోక్షంగా తోడ్పతోంది. క్షణం తీరికలేని ఉద్యోగులు ఉరుకులు పరుగులమీద తమ ప్రస్థానాన్ని కొనస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుల తరబడి షాపింగ్ చే సే వెసులుబాటు లేకపోవడం వల్ల వారు వెడ్డింగ్ మా ల్స్‌నే ఎంచుకుంటున్నారు. వెడ్డింగ్ మాల్స్‌లో పెళ్లికి సంబంధించిన వస్తుసామాగ్రితోపాటు మ్యారేజికి సంబంధించిన కొన్ని సలహాలను కూడా వెడ్డింగ్ మాల్స్ ఇస్తుండడం విశే షం. ఒక్కోసారి ఎన్ని సమకూర్చుకున్నప్పటికీ తీరా పెళ్లి ముహూర్తం దగ్గరపడే సరికి ఏవో కొన్ని వస్తువులు తక్కువపడతాయి. అయితే వెడ్డింగ్‌మాల్స్‌కి వెళ్లే కస్టమర్లకు మాత్రం ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకపోవచ్చు. ఎందుకంటే, మన లిస్ట్‌లో లేని సామాగ్రి కూడా ఒక్కసారి వెడ్డింగ్ మాల్స్‌ను సందర్శిస్తే.. గుర్తుకు వస్తాయంటే అతిశయోక్తి కాదు.
పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా నగ రంలోని వివిధ వెడ్డింగ్ మాల్స్ నిర్వాహకులు విని యోగదారులను ఆకట్టు కునేందుకు ప్రత్యేక ఆఫర్ల ను ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మేజర్‌న్యూస్’ ఆయా వెడ్డింగ్ మాల్స్ యజమానులతో మా ట్లాడింది. ఆర్థికమాంద్యం ప్రభావం, సాఫ్ట్‌వేర్ బూమ్ పడిపోవడం, ప్రాంతీయ గొడవలతో మాటిమాటి బందులు జరుగుతుండడంతో వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతున్నాయని తెలియజేస్తున్నారు. నగరంలో పదికి పైగా ఉన్న ప్రముఖ వెడ్డింగ్ మాల్స్‌ను సందర్శించిన మా ‘సూర్య’ ప్రతినిధితో వారు పంచుకున్న అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.
సంక్రాంతి ఆఫర్లతో తేరుకున్నాం... - కళ్యాణ్, యజమాని,కళామందిర్.
ఆర్థికమాంద్యం, తెలంగాణ ఆందోళనలు, బంద్‌ల మూలంగా గత మూడు నెలలుగా వ్యాపారాలు దెబ్బతిని వెడ్డింగ్‌మాల్స్ వెలవెలబో తున్నాయి. నవంబర్ నెలకు ముందు ఆర్థికమాంద్యం ప్రభావం పెద్దగా కనబడకపోయినా ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వచ్చింది. కాగా సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రవేశపెటి ్టన ఆఫర్లు, డిస్కౌంట్ల మూలంగా కొద్దిగా తేరుకోగలిగాము. ఇక వచ్చే నెల 23 నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్ కోసం ఎదు రుచూస్తున్నాము. వచ్చే నెల నుంచి తిరిగి వ్యాపారాలు పుంజు కుంటాయని ఆశిస్తున్నాము. రాబోయే ఉగాది, పెళ్లిళ్లసీజన్ తిరి గి వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పుంజుకునేటట్టు చేస్తా యని భావిస్తున్నాము. వచ్చేనెల 15 తర్వాత కొత్త ఆఫ ర్లు, డిస్కౌంట్లను ప్రవేశపెట్టనున్నాము. ఈ డిస్కౌంట్లతో మా ర్కెట్ పుంజుకుంటుందని ఆశిస్తున్నాం. ఆర్థికమాం ద్యం, తగ్గుముఖం పడుతుండండం శుభ పరిణామం.
ఆర్ధికమాంద్యంతో అతలాకుతలం..కాస్ట్ టు కాస్ట్ ఆఫర్లతో... - సతీష్, యజమాని, చందనబ్రదర్స్ (జనరల్‌బజార్, సికింద్రాబాద్)
రాబోయే పెళ్లిళ్ల సీజన్ వ్యాపారులకు ఆశాకిరణంగా మారింది. దెబ్బతిన్న వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలు పుం జుకునేందుకు ఈ సీజన్‌ను దృష్టిలో పె ట్టుకొని ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టేందు కు కృషిచేసున్నాము. ఈ సీజన్‌లో కాస్ట్ టు కాస్ట్ ఆఫర్లను ప్రవేశపెట్టేందుకు ప్రణా ళికలను రూపొందిస్తున్నాము. ఇక గత రెండు, మూడు నెలలుగా ఆర్థికమాం ద్యం, తెలంగాణ ఆందోళనల మూలంగా తీవ్ర ఇబ్బందుల పాలయ్యాము. ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుండి బయటపడుతు న్నాం. కస్టమర్ల తాకిడి కూడా పెరుతుంది.
‘ఎండ్ ఆఫ్ సీజన్’ ప్రత్యేక ఆఫర్... - రాజేంద్రకుమార్, సిఎండి, కళానికేతన్.
గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆర్థి కమాంద్యం, తెలంగాణ ఆందోళనలు వ్యాపా రా లపై తీరని ప్రభావాన్ని చూపిస్తున్నాయి. విని యోగదారులను ఆక ట్టుకునేందుకు కొం త కాలం క్రితం ఎం డ్ ఆఫ్ సీజన్ పేరిట ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశ పెట్టాము. ఇక రాబోయే పె ళ్లిళ్ల సీజ న్‌ను దృష్టిలో పెటు ్టకొని మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో కొనుగోలుదారుల ముందుకు రానున్నాము. ఈ పెళ్లి సీజన్‌పై అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నాము. మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలను అందించడానికి కృషి చేస్తున్నాం.
- మీ వారం 05/09/2010
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఆ ఊళ్లో... బోయలకు రాత్రంటే భయం
- ‘మధుబాల’ గా నటించడం నా అదృష్టం
- మా మంచి పల్లె మావల
- చరిత్రలో ఈ వారం
- అనాగరిక శృంగారం
- గోల్కోండ కోటలో రక్త చరిత్ర
- ఇతర లోన్లు... ఎడ్యుకేషన్ లోన్‌కు ఆటంకం కాదు
- సంఖ్యాలజీ
- సుజుకీ ‘స్లిమ్ షాట్’
- బిజినెస్ ‘ప్రభు’
- తెలంగాణ కోసం నేను సైతం సైకిల్ దిగి... కారెక్కిన సుధాకర్‌రావు
- పురాతన సంస్కృతికి నిలువుటద్దం ‘శ్రీ రంగనాయక స్వామి గుట్ట’
- ఉండ్రాళ్లు
- ఐతా చంద్రయ్య
- గౌరవం
- మౌనవ్రతం ఎప్పుడు చేయాలి ?
- ఆరోగ్యంపై వాస్తు ప్రభావం
- కూర్మావతారం
- ‘వి’నాయక కథ... !
- ఆదిపర్వం - తృతీయాశ్వాసం
- నీలుడు - ప్రహస్తుడు
- ఓ నేస్తమా
- బీదవాడినయా !!
- హాయ్...
- ‘రోబో’ ఇలా వచ్చాడట .. !
- కోకాకోలా
- కళాగణేశుని కదంబ నృత్యం...
- మీ వారం 29/08/2010
- బిపాసా ఎంతో బిజీ...
- ఎడిటర్‌తో... ముఖాముఖి
- ఒకే ఒక్కడు గాన గంధర్వుడు
- నరసింహుడు అరుదెంచిన.. నాచగిరి
- ఆ పల్లెలో ప్రకృతిమాత పరవశిస్తోంది
- మౌనంగానే ఎదుగుతూ. . .
- చరిత్రలో ఈ వారం
- పోరాటమే ఊపిరిగా. . .
- శంకర వెంకట నారాయణరావు
- కామసూత్ర గ్రంథం - విశ్లేషణ


























































