కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై ఉద్యోగుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో సెప్టెంబర్ 1న 'చలో విజయవాడ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో సీపీఎస్ నేతలు సమావేశమై చర్చించగా సీపీఎస్ స్థానంలో జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీం) ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.