రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలపై అనవసరమైన నిబంధనలు విధించిందని వాటిని పూర్తిగా ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం బీజేపీ నాయకులతో కలిసి దువ్వూరు మండల సబ్ ఇన్స్పెక్టర్ రాజు కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు అమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ బ్రహ్మచారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బాలనాగిరెడ్డి, బిజెపి కార్యదర్శి హరికృష్ణ, సోషల్ మీడియా మండల కన్వీనర్ నరేష్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రంగనాథ్, గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులు పాల్గొన్నారు.