చిత్తూరు నగరంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, హోటల్ సరోజ్ కృష్ణ ప్రొప్రైటర్, రాష్ట్రస్థాయి కాపు నాయకుడు పివి. రెడ్డి ప్రసాద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు వారికి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.