ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాల నుంచి ఏపీకి కాస్త ఉపసమనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 12, 2022, 09:12 PM

భారీ వర్షాలతో ఇబ్బందులను ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కస్తా ఊరాట లభించబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ చత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణిస్తూ నేడు తీవ్రత తగ్గి అల్పపీడనం స్థాయికి పడిపోతుందని వివరించారు. ఏపీలో వర్షాలు తగ్గుముఖం పడతాయని, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ జల్లులు కురుస్తాయని తెలిపారు. అదే సమయంలో సముద్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రంలో అలజడి పూర్తిగా తొలగిపోలేదని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇదిలావుంటే వాయుగుండం ప్రభావం ఏపీపై పెద్దగా కనిపించలేదు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు మినహా రాష్ట్రంలోని మిగతా భాగాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నిన్న పాలకోడేరులో అత్యధికంగా 14 సెంమీ వర్షపాతం నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com