ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 56 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ గోపినాథ్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ దసరా నేపథ్యంలో అనంతపురానికి 28, శ్రీ సత్యసాయి జిల్లాకు 28 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa