తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ గుడివాడ నియోజకవర్గ సరిహద్దు రెడ్డిపాలెంలో వైసీపీ నేతల బ్యానర్లు వెలిసాయి. రాత్రికి రాత్రే ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర శుక్రవారం రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో బ్యానర్లు వెలసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ‘మేము ఎవరి జోలికి వెళ్ళం.. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నలుగుతాం’ అంటూ రెడ్డిపాలెం సెంటర్లో వైసీపీ యువదళం పేరిట బ్యానర్లు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa