గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నేతాజీ నగర్ కు చెందిన పోలిశెట్టి ప్రసాద్, సంజీవ నగర్ కాలనీకి చెందిన షేక్ ఇసానాబుల్ లు గుట్టు చప్పుడు కాకుండా పట్టణంలో గుట్కాలు విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2, 385 గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 10, 400 రూపాయలు ఉంటుందని సిఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.