కాంగ్రెస్ నేత, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి శుక్రవారం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న మూడో అభ్యర్థి త్రిపాఠి కాగా, మరో ఇద్దరు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్. మల్లికార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి మద్దతు పుష్కలంగా ఉంది. ఆయన ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది.