ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాకు మూడు నోబెల్ పురస్కారాలు..ఆర్థికంలోని వారికి

international |  Suryaa Desk  | Published : Mon, Oct 10, 2022, 10:09 PM

అమెరికాకు అరుదైన గౌరవం దక్కింది. ఆర్థిక శాస్త్రంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నోబెల్ పుర‌స్కారం అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్త‌ల‌కు ద‌క్కింది. ఈ మేర‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తిని అమెరికాకు చెందిన బెన్ ఎస్ బెర్నాంకే, డ‌గ్ల‌స్ డబ్ల్యూ డైమండ్‌, ఫిలిప్ హెచ్‌. డిబ్‌విగ్‌ల‌కు అందించ‌నున్న‌ట్లు అకాడెమీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభంపై జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల‌కు గాను వీరిని ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక చేసిన‌ట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa