అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పట్టుబడిన కేసుల్లో సీజ్ చేసిన పది మోటార్ సైకిళ్లను గురువారం బహిరంగ వేలం వేయనున్నట్లు పర్చూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ యశోధరాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. పర్చూరు సెబ్ కార్యాలయం ఆవరణలో ఈ వేలం పాట జరుగుతుందని ఆమె చెప్పారు. మోటారు బైకులు ఎలా ఉన్నవి అలానే వేలం వేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల ప్రజలు ధరావత్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని సీఐ కోరారు.