ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ, అమిత్ షా మద్దతు లేకుండా జగన్ సీఎం కూర్చీలో కూర్చోలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 09:21 PM

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మద్దతు లేకపోతే జగన్ ఒక్క రోజు కూడా సీఎం కూర్చీలో కూర్చోలేరని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. ఎన్ని కేసులు ఉన్నా, అవినీతి నిరూపితమైనా జగన్ పై చర్యలు ఉండవని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజాస్వామ్యం పట్టదని, రాజ్యాంగంపై ఏమాత్రం అవగాహన లేదని ఆయన అన్నారు. 


జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీలో పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని కోరారు. టీడీపీ, జనసేనలతో కలసి పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు. చంద్రబాబు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాలపై కూడా దృష్టిని సారించాలని అన్నారు. విశాఖను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దోచుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డికి ఉన్నంత పవర్ మరెవరికీ లేదని చెప్పారు. బీజేపీ కుట్రలు పవన్ కల్యాణ్ కు అర్థమయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇతర పార్టీలతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధమని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com