పల్నాడు జిల్లా, దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదగార్లపాడు గ్రామ శివారులోని చెట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరలోని ఒక అపార్టుమెంట్లో దొంగతనం నేరం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. ముమ్మర దర్యాప్తు జరిపి దొంగతనానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించిన శ్రీ ఎస్పీ. ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి,ఇంటి లోపల ఉన్న బీరువా తాళాలు కూడా పగులగొట్టి దానిలోని నగదు మరియు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్ళారు చోరి అయిన సొత్తు విలువ సుమారు 37 లక్షలు ఉంటుందని అంచనా.