పెండింగ్ కేసుల పరిష్కారం పై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని ఎయిర్ పోర్టు సి. ఐ బి. ఎం. డి ప్రసాద్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిర్ పోర్టు సి. ఐ గా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ప్రస్తుతం సి. ఐ గ బాధ్యతలు నిర్వహిస్తున్న సి. హెచ్. ఉమాకాంత్ పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన సి. ఐ బి. ఎం. డి ప్రసాద్ రావు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 2004 బ్యాచ్ కు చెందిన ప్రసాద్ రావు దేవరపల్లి , జి. మాడుగుల , కొయ్యూరు , గాజువాక లా అండ్ ఆర్డర్ , త్రీ టౌన్ ట్రాఫిక్ విభాగంలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. అనంతరం సి. ఐ గ పదోన్నతి పొందిన అయిన విజయనగరం సి. సి. ఎస్, విశాఖ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ , బొబ్బిలి రూరల్, గాజువాక ట్రాఫిక్ తదితర విభాగాల్లో సీఐగా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం ఎయిర్ పోర్టు సి. ఐ గ బదిలీపై వచ్చారు. శాంతి భద్రత పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. స్టేషన్ పరిథి లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి డి కోడ్స్ , బ్లూ కొడ్స్ బృందాలను సమన్వయపరుస్తూ ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నిఘా ఉంచుతామని అన్నారు. ఈ సందర్భం గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. అంతకుముందు ఎయిర్ పోర్ట్ సిఐ గా బాధ్యతలు నిర్వహించిన ఉమాకాంత్ కు సిబ్బంది శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్. ఐ లు మోహన్ రావు , కే. రామకృష్ణ , పి. శివ , ఏ ఎస్. ఐ జుబేదా బేగం , శివ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa