ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిస్తున్న కరోనా...ఉపసమనం పొందుతున్న ప్రపంచం

international |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 09:40 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి ఇపుడిపుడే శాంతిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలావుంటే కరోనా మహమ్మారి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓ వ్యక్తి కరోనా నుంచి బయటపడటానికి సుదీర్ఘంగా మహమ్మారితో పోరాడాడు. ఏకంగా 411 రోజుల పాటు కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. 


బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తికి 2020 డిసెంబర్ లో ఫస్ట్ వేవ్ లో కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు. పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ (లాంగ్ కోవిడ్) కారణంగా ఆయన బాధపడ్డారు. వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధిని నయం చేశామని బ్రిటన్ వైద్యులు తెలిపారు. చనిపోతాడనుకున్న వ్యక్తిని బతికించామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com