ఢిల్లీలో అఫ్తాబ్ అనే యువకుడు తన ప్రియురాలు శ్రద్ధను హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, ఆ భాగాలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అఫ్తాబ్ దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని పోలీస్ స్టేషన్ లో లాకప్ లో ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒకరిద్దరు పోలీసులు అతనిని గమనిస్తూ సెల్ బయట కూర్చున్నారు. తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు అతన్ని 5 రోజుల పాటు లాకప్ లోనే ఉంచుతారు.