ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాజకీయ చరిత్రపై అవగాహన లేకనో, తెలుగుదేశం ‘సీనియర్ నేతల’ ప్రాంప్టింగ్ లో లోపాల వల్లనో గాని ఈ పార్టీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ ఈమధ్య మాట్లాడేవన్నీ తప్పుల తడకలే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పాలకపక్షం అధినేతపై అభాండాలు వేయడానికి లోకేష్ కావాలని అవాస్తవాలు చెబుతున్నాడన్నారు. తండ్రి ఎన్.చంద్రబాబు నాయుడు ‘ప్లానింగ్’ పుణ్యమా అని అమెరికాలో బీఎస్, ఎంబీఏ చదివిన నారా లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానం బొత్తిగా లేదని, రాజకీయ ప్రత్యర్ధులపై అడ్డగోలు నిందలేయడం తప్ప ఏదీ రాదని పదే పదే రుజువవుతోందన్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఓ స్టోరీని విడుదల చేశారు.