చుండూరు మండల పరిధిలోని వేటపాలెం గ్రామంలో సోమవారం గ్రామసచివాలయ సిబ్బందితో, వాలంటీర్లతో, గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ప్రతి గృహాన్ని సందర్శించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి కరపత్రాల ద్వారా వివరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ లు యేసుదాసు, అప్పిరెడ్డి, ఎం. పి. పి, జాలది రూబేను, మాజీసర్పంచ్ కంఠంనేని శ్రీనివాసరావు, ఎం. పి. టి. సి, రామాంజనేయులు, మండల తహసీల్దార్ కనకదుర్గ, ఎం. పి. డి. ఓ, సుగుణమ్మ, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.