ఉత్తరప్రదేశ్లోని ప్రతిష్టాత్మక మైన్పురి లోక్సభ ఉప ఎన్నిక యావద్దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతితో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్ 5న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగనుంది. ములాయం సింగ్ కోడలు, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. ములాయం సింగ్ యాదవ్ చిన్ననాటి స్కూలు టీచర్ ఉదయ్ ప్రతాప్ సింగ్, ఆయన కుటుంబ సభ్యుడు నాథుసింగ్లను ములాయం సింగ్ తన గురువులుగా భావించేవారు. వీరు డింపుల్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు.