పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. హేయమైన నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన రెండు ముఖ్యమైన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందడంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.ఈ సవరణ రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాద సూత్రాలకు అనుగుణంగా ఉందని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు. అయితే, ఈ బిల్లులు అక్టోబర్ 2018 నుండి రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని మాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మత శాంతి, సౌభ్రాతృత్వానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే నేరస్తులను అరికట్టాలంటే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.