మహారాష్ట్రలో ముంబైకి సమీపంలోని వాసైకి చెందిన వ్యక్తిని మంగళవారం సాయంత్రం ముగ్గురు వ్యక్తుల ముఠా కిడ్నాప్ చేసి కొట్టింది. నిందితులు ఆ వ్యక్తిపై భౌతిక దాడికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడిని నిందితులు కిడ్నాప్ చేసి, అక్కడి నుండి పారిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయ్యింది. వాలీవ్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో ఒక బొలెరో కారు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన వెనుక స్థానికంగా రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని హర్జీత్ సింగ్ అలియాస్ దాదుగా గుర్తించారు.