మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు జనవరి 3న ఊహించని మలుపు తిరుగుతుందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రస్థానంలో జగన్ వంటి సీఎంను చూడలేదని తెలిపారు. ఏపీలో ఇసుక, మట్టి, మద్యం అన్నీ అవినీతిమయం అయ్యాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబే కాపాడగలరని అన్నారు. విద్యార్ధులకు ట్యాబ్ల పంపిణీ పేరుతో జగన్ ప్రభుత్వం రూ.14 వందల కోట్ల అవినీతికి పాల్పడుతోందన్నారు. టీచర్లపై కక్షతో బైజూస్ ప్రవేశపెట్టి విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని డీఎల్ రవీంద్రారెడ్డి స్పష్టం చేశారు.