గుంటూరు పట్టణంలోని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన స్థాయిసంఘం (స్టాండింగ్ కమిటీ ) సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రజాయోపకరమైన పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ కీర్తి చేకూరి, పలువురు కార్పోరేటర్లు పాల్గొన్నారు.