జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఒక కొత్త గ్రహశకలాన్ని కనుగొంది. ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే మూడు రెట్లు పెద్దగా ఉందని, ఈ గ్రహశకలం ఇప్పటివరకు వెబ్ ద్వారా కనుగొనబడిన గ్రహశకలాల్లో అతి చిన్నదని నాసా తెలిపింది. ఇది ఒక కిలోమీటరు కంటే తక్కువ పొడవు ఉన్న వస్తువుకు ఉదాహరణగా ఉండవచ్చని పేర్కొంది. దీనిని యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం కనుగొంది. ఈ గ్రహశకలం పొడవు 100 నుండి 200 మీటర్ల పొడవు ఉన్నట్లు తెలిపింది. ఈ గ్రహశకలం అంగారకుడు, బృహస్పతి మధ్య ఉందని నాసా తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa