పెనమలూరు జగనన్న కాలనీ లేఅవుట్ నందు ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని పెనమలూరు మండల అభివృద్ధి అధికారిని సునీత శర్మ అన్నారు. శనివారం నాడు ఆమె పెనమలూరు జగనన్న కాలనీ లే అవుట్ లో ఇంజనీరింగ్ అధికారులు మరియు సచివాలయ సిబ్బందితో కలిసి నిర్మాణం జరుగుతున్న పలు ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకి పలు సూచనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు లో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని మంజూరు చేయడం జరిగిందని. చాలామంది లబ్ధిదారులు ఇప్పటికే నిర్మాణాలను చేయడం జరిగిందని. కొన్నిచోట్ల ఇంకా కొంతమేర పనులు పూర్తి చేయాల్సి ఉందని వారు కూడా త్వరగా నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేసుకుని సొంతింటి కల నెరవేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ. జి. ఎస్. వి. ఎస్. రాజు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.