తాను ఎప్పటికీ సీఎం వైయస్ జగన్ వెంటే ఉంటానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. అనివార్య కారణాలవల్ల నియోజకవర్గంలో తాను కొంతకాలంగా చురుగ్గా లేనని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేశారన్నారు. తన మనసు సహకరించకపోతే తన పని తాను చేసుకుంటూ పోతానే తప్ప పార్టీ మారబోనన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ తనను పిలిపించి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై తనకు స్పష్టతనిచ్చారన్నారు. మరో వారం రోజుల్లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తానన్నారు.