గృహ నిర్మాణాలను వేగవంతం చేయలని ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. సింహాద్రిపురం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గృహ నిర్మాణంపై ఆయన సమీక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదన్నారు. గడువులోపు ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగలింగాచారి, ఎంపీడీఓ పాల్గొన్నారు.