పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనుకొండ పట్టణంలోని కోర్టు ఆవరణంలోని బా రూంలో లాయర్లతో ఎమ్మెల్యే ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పోటీచేయుచున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి కి న్యాయవాదులు తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ. జి. పి ఎం. భాస్కర్ రెడ్డి, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.